Jalsa 4K: 14 ఏళ్లు అయినా పవర్ తగ్గలేదు!
ABN , First Publish Date - 2022-08-31T00:28:42+05:30 IST
‘సినిమా వచ్చి పద్నాలుగేళ్లు అయింది అయినా పవర్ తగ్గలేదు’ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డైలాగ్ ఇది. ఇదంతా పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన ‘జల్సా’ 4కె ట్రైలర్ గురించి! ఈ చిత్రం రీ రిలీజ్ అవుతుంది. పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ ఒకటో తేదీన ఈ చిత్రాన్ని 4కె రిజల్యూషన్‌లో విడుదల చేస్తున్నారు.

‘సినిమా వచ్చి పద్నాలుగేళ్లు అయింది అయినా పవర్ తగ్గలేదు’ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డైలాగ్ ఇది. ఇదంతా పవన్‌కల్యాణ్ (Pawan kalyan)హీరోగా నటించిన ‘జల్సా’ 4కె (Jalsa 4K) ట్రైలర్ గురించి! ఈ చిత్రం రీ రిలీజ్ అవుతుంది. పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ ఒకటో తేదీన ఈ చిత్రాన్ని 4కె రిజల్యూషన్‌లో విడుదల చేస్తున్నారు. ఇప్పుడంతా 4కె ట్రెండ్ నడుస్తోంది. గతంలో ఫిల్మ్ ఫార్మెట్లో విడుదలై విజయవంతమైన చిత్రాలను డిజిటలైజ్ చేసి 4కె రిజల్యూషన్‌లో ఆయా హీరోల పుట్టినరోజు వేడుకలకు రీ రిలీజ్ చేస్తున్నాడు. మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ‘పోకిరి’ చిత్రంతో మొదలైన ఈ ట్రెండ్ అలా కొనసాగుతూనే ఉంది. చిరంజీవి పుట్టినరోజున ‘ఘరానా మొగుడు’ చిత్రాన్ని విడుదల చేశారు. ఇప్పుడు పవన్ సినిమా వంతు వచ్చింది. సెప్టెంబర్ 2న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘జల్సా’ సినిమాను ఒకటో తేదీన విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను, పోస్టర్‌ను హీరో సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో కీలక సన్నివేశాలకు మహేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పుడు ఆ వాయిస్‌కి తగ్గట్లు ఎడిట్ చేసి ట్రైలర్‌ను వదిలారు. హీరో ఇంట్రడక్షన్, యాక్షన్ సీన్స్, పాటలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ (Geetha arts)పతాకంపై అల్లు అరవింద్(Allu aravind) నిర్మించారు.