Jalsa4K Trailer: షేకవుతోన్న యూట్యూబ్ రికార్డ్స్
ABN , First Publish Date - 2022-08-31T03:23:01+05:30 IST
ఆఫ్ లైన్ సెలబ్రేషన్స్ అయినా, ఆన్ లైన్ సెలబ్రేషన్స్ అయినా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan)కి కాంపిటేషన్ ఇచ్చే వాళ్లు ఇండస్ట్రీలోనే లేరనే మాట ఉంది. తరచుగా వినిపించే

ఆఫ్ లైన్ సెలబ్రేషన్స్ అయినా, ఆన్ లైన్ సెలబ్రేషన్స్ అయినా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan)కి కాంపిటేషన్ ఇచ్చే వాళ్లు ఇండస్ట్రీలోనే లేరనే మాట ఉంది. తరచుగా వినిపించే ఈ మాటని నిజం చేస్తూ, పవర్ స్టార్ ఫ్యాన్స్ మరోసారి యుట్యూబ్ని షేక్ చేశారు. సెప్టెంబర్ 1న ‘జల్సా’ (Jalsa) స్పెషల్ షోస్‌కి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ ఫాన్స్... ‘జల్సా’ రీరిలీజ్ రోజు థియేటర్స్‌లో హంగామా ఏ రేంజ్లో ఉంటుందో చూపించడానికి శాంపిల్‌గా యూట్యూబ్‌ని షేక్ చేస్తున్నారు.
రీ-రిలీజ్ అంటే థియేటర్లో ఉండాలి కానీ, యూట్యూబ్‌లో ఏం చేస్తున్నారనే కదా మీ డౌట్... ‘జల్సా’ ట్రైలర్‌ని రీమాస్టర్ చేసి, 4k వెర్షన్‌ని గీతా ఆర్ట్స్ (Geetha Arts) యూట్యూబ్ ఛానెల్లో మళ్లీ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన అతి తక్కువ సమయంలోనే 1 మిలియన్ మంది ఈ ట్రైలర్‌ని చూశారు. రీరిలీజ్ చేసిన ట్రైలర్‌కి ఈ రేంజ్ వ్యూస్ రావడమంటే మాములు విషయం కాదు. అలాగే లక్షకు పైగా లైక్స్ ఉండడం ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం. ‘జల్సా’ ట్రైలర్ ఈ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి పవన్ ఫ్యాన్స్ మాత్రమే రీజన్ కాదు, మహేశ్ (Mahesh) ఫాన్స్ కూడా కారణమే.
అదెలా అంటే.. ‘జల్సా’ సినిమాకి, ‘జల్సా’ ట్రైలర్‌కి మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సూపర్ స్టార్ వాయిస్‌కి, పవర్ స్టార్ విజువల్‌ని చూడడానికి మ్యూచువల్ ఫ్యాన్స్ రిపీట్ మోడ్‌లో.. ‘జల్సా’ ట్రైలర్‌ని చూస్తున్నారు. ఈ ట్రైలర్‌తో పవర్ స్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యాయి.. ఇక సెప్టెంబర్ 1న థియేటర్స్‌లో పవన్ ఫ్యాన్స్ చేయబోయే సెలబ్రేషన్స్ ఇంకే రేంజ్లో ఉంటాయో చూడాలి. (Jalsa Trailer)