వినూత్నంగా ‘పీప్ షో’
ABN , First Publish Date - 2022-07-17T06:32:21+05:30 IST
జబర్దస్త్ ఫేమ్ ‘ఆటో’ రాంప్రసాద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పీప్ షో’. క్రాంతికుమార్ సి.హెచ్ దర్శకుడు....

జబర్దస్త్ ఫేమ్ ‘ఆటో’ రాంప్రసాద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పీప్ షో’. క్రాంతికుమార్ సి.హెచ్ దర్శకుడు. నేహాదేశ్ పాండే కథానాయిక. అమి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో టీజర్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘దొంగచాటుగా తొంగి తొంగి చూడడాన్ని ‘పీప్ షో’ అంటారు. ఈ కథకు ఈ టైటిల్ సరిపోతుంది. వినూత్నమైన సన్నివేశాలు, పాత్రలు ఈ సినిమాలో కనిపిస్తాయి. బుల్లి తెరపై స్టార్‌గా వెలుగుతున్న రాంప్రసాద్ ఈ సినిమాతో సినిమాల్లోనూ తన సత్తా చూపిస్తాడ’’న్నారు.