IMDb: మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్..

ABN , First Publish Date - 2022-12-08T00:22:44+05:30 IST

ఈ ఏడాది విరామం లేకుండా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వివిధ సంస్థలు మోస్ట్ సెర్చ్‌డ్ మూవీస్, మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్ట్‌ను వెల్లడిస్తున్నాయి.

IMDb: మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్..

ఈ ఏడాది విరామం లేకుండా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వివిధ సంస్థలు మోస్ట్ సెర్చ్‌డ్ మూవీస్, మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్ట్‌ను వెల్లడిస్తున్నాయి. తాజాగా ‘ద ఇంటర్నె మూవీ డేటాబేస్’ (ఐఎండీబీ)(IMDb) 2022కు సంబంధించి మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200మిలియన్స్ పైగా సినీ ప్రేక్షకుల అభిప్రాయాలను తీసుకుని ఈ ర్యాంకింగ్‌ను వెల్లడించినట్టు పేర్కొంది. ఈ జాబితాలో అనేక మంది సౌతిండియన్ స్టార్స్ స్థానం సంపాదించుకున్నారు. బాలీవుడ్ నుంచి ఒక్క నటుడు మాత్రమే చోటు దక్కించుకున్నాడు. ఐఎండీబీ విడుదల చేసిన లిస్ట్‌పై ఓ లుక్కేద్దామా మరి..   


1. ధనుష్‌ (Dhanush)

2. ఆలియా భట్‌ (Alia Bhatt)

3. ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ (Aishwarya Rai Bachchan)

4. రామ్‌చరణ్‌ (Ram Charan)

5. సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu)

6. హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan)

7. కియారా అడ్వాణీ (Kiara Advani)

8. జూనియర్ ఎన్టీఆర్‌ (Junior NTR)

9. అల్లు అర్జున్‌ (Allu Arjun)

10. యశ్‌ (Yash)


ధనుష్ కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో గతంలోనే మెరిశాడు. అందువల్ల అక్కడి ప్రేక్షకులకు అతడు సుపరిచితమే. ఈ ఏడాది ‘గ్రే మ్యాన్’ లో కనిపించి ప్రేక్షకులను ఆలరించాడు. ఆలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’, ‘గంగూబాయి కతియావాడి’ చిత్రాలతో గుర్తింపును సంపాదించుకుంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ చిత్రంతో ఈ ఏడాది హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఐశ్వర్య రాయ్ ‘పొన్నియిన్ సెల్వన్’ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ లో రామ్  చరణ్, జూనియర్ ఎన్‌టీఆర్ హీరోలుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువయ్యారు. అందువల్ల ఈ లిస్ట్‌లో రామ్ చరణ్ నాలుగో స్థానం, జూనియర్ ఎన్టీఆర్ ఎనిమిదో స్థానంలో నిలిచారు.

Updated Date - 2022-12-08T00:22:44+05:30 IST