హై వోల్టేజి యాక్షన్
ABN , First Publish Date - 2022-05-23T05:32:51+05:30 IST
జొన్నలగడ్డ హరికృష్ణ, మోక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆటో రజిని’. శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకుడు. ఆయన మాట్లాడుతూ...

జొన్నలగడ్డ హరికృష్ణ, మోక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆటో రజిని’. శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకుడు. ఆయన మాట్లాడుతూ ‘ఇటీవలె విజయవాడలో భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తయింది. బాపట్ల ఎంపీ నందిగాం సురేష్, హరి జొన్నలగడ్డ కాంబినేషన్ కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం’ అని చెప్పారు. జులైలో నెల్లూరు కృష్ణపట్నం పోర్టులో పతాక సన్నివేశాలు తెరకెక్కిస్తామని చిత్రబృందం తెలిపింది. సంగీతం మణిశర్మ.