Kantarao Family: ఇల్లు ఇచ్చి.. మా కుటుంబాన్ని ఆదుకోండి!
ABN , First Publish Date - 2022-11-17T21:28:21+05:30 IST
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ అందించిన నటుడలు కాంతారావు కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. దీనిపై ఆయన కుమారుడు రాజా తెలంగాణ ప్రభుత్వానికి ఓసారి విజ్ఞప్తి చేశారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ అందించిన నటుడలు కాంతారావు (Kantharao)కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. దీనిపై ఆయన కుమారుడు రాజా (Raja) తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Govt)ఓసారి విజ్ఞప్తి చేశారు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని, అద్దె ఇంట్లో జీవిస్తున్నామని హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన కాంతారావు (Kantharao Family )శత జయంతి (Kantharao 100 years)ఉత్సవాల్లో రాజా పాల్గొన్నారు. ‘‘నా తండ్రి శత జయంతి వేడుకల్లో పాల్గొవడం ఆనందంగా ఉంది. సినీ పరిశ్రమ అంటే నాన్నకు ఎంతో ఇష్టం. ఆస్తులు అమ్ముకుని మరీ సినిమాలు తీశారు. దానివల్ల్ల మేము ఆర్థికంగా నష్టపోయాం. నాన్న క్యాన్సర్ బారిన పడినప్పుడు చికిత్స నిమిత్తం ఎంతో డబ్బు ఖర్చు చేశాం. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా. నగర శివార్లలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జీవితం సాగిస్తున్నాం. ఇన్ని కష్టాల్లో ఉన్న మాకు ఇండస్ట్రీ నుంచీ ఎలాంటి సాయం అందలేదు. మా కుటుంబానికి ఓ ఇల్లు కేటాయించి ఆదుకోవాలని తెలంగాణా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను’’ అని విజ్ఞప్తి చేశారు.