హీరోగా ప్రభాకర్‌ తనయుడు

ABN , First Publish Date - 2022-09-17T08:13:47+05:30 IST

బుల్లితెర నటుడు ప్రభాకర్‌ తనయుడు చంద్రహాస్‌ హీరోగా పరిచయమవుతున్నారు. నేడు అతని పుట్టిన రోజు. ఈ సందర్భంగా..

హీరోగా ప్రభాకర్‌ తనయుడు

బుల్లితెర నటుడు ప్రభాకర్‌ తనయుడు చంద్రహాస్‌ హీరోగా పరిచయమవుతున్నారు. నేడు అతని పుట్టిన రోజు. ఈ సందర్భంగా  అతను నటిస్తున్న మూడు చిత్రాల పోస్టర్‌లను ప్రభాకర్‌, మలయజ దంపతులు శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ మాట్లాడుతూ ‘చదువు పూర్తి చేసి, నటుడు అవ్వాలనే లక్ష్యంతో మా అబ్బాయి చంద్రహాస్‌ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. ఫైట్స్‌, డాన్స్‌, నటనలో శిక్షణ తీసుకున్నాడు. కృష్ణ దర్శకత్వంలో కిరణ్‌ బోయినపల్లి, కిరణ్‌ జక్కంశెట్టి ఓ చిత్రం నిర్మిస్తున్నారు. సంపత్‌ వి. రుద్ర దర్శకత్వంలో ఏవీఆర్‌, నరేష్‌ మరో చిత్రానికి నిర్మాతలు. మా బేనర్‌ సుమనోహర్‌ ప్రొడక్షన్స్‌పై సొంతంగా ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నాం’ అని చెప్పారు. చంద్రహాస్‌ మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి నటుడు అవ్వాలనే కోరిక బలపడింది. ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు. 

Updated Date - 2022-09-17T08:13:47+05:30 IST