Bollywood: వారికి నటన కంటే.. డేటింగ్ లైఫ్ అంటేనే ఇష్టం
ABN , First Publish Date - 2022-11-17T19:30:58+05:30 IST
రాజ్ కుమార్ రావు, రాధికా ఆప్టే, హుమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మోనిక ఓ మై డార్లింగ్’..
రాజ్ కుమార్ రావు, రాధికా ఆప్టే, హుమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మోనిక ఓ మై డార్లింగ్’ (Monica, O My Darling). ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని చూసిన బాలీవుడ్ (Bollywood) యువ నటుడు, అనిల్ కపూర్ కుమారుడు హర్ష వర్థన్ కపూర్ (Harsh Varrdhan Kapoor) బాలీవుడ్ ప్రేక్షకుల మీద సెటైర్లు వేశాడు. వారికి సినిమాల కంటే నటులకి సంబంధించిన ఇతర విషయాల అంటే ఇష్టం అంటూ విమర్శలు చేశాడు.
హర్షవర్థన్ కపూర్ చేసిన ట్వీట్ (Tweet)లో.. ‘ఇక్కడ చాలామందికి నటన కంటే.. నటులు ఏం తింటున్నారు.. ఎవరితో డేటింగ్ చేస్తున్నారు అనేదే దాని మీదే ప్రేక్షకులు దృష్టి పెడుతున్నారు. దానితోనే బాలీవుడ్ ఆడియన్స్ సంతృప్తి చెందారు. అంతేకాకుండా.. బాలీవుడ్ బ్లాగుల మీద దృష్టి పెడుతున్నారు. సినిమాల గురించి పట్టించుకోవడం మానేశాడు.
మోనికా ఓ మై డార్లింగ్ సినిమా చాలా బావుంది. నటులు అందరు అద్భుతంగా నటించారు.. వాసన్ అద్భుతంగా సినిమాని తీశాడు.. మిలియన్ల మంది చూస్తారని ఆశిస్తున్నాను’ అని రాసుకొచ్చాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి వాసన్ బాలా దర్శకత్వం వహించాడు.