Harihara Veeramallu: పవన్ బర్త్ డే సర్‌ప్రైజ్ రివీలైంది..

ABN , First Publish Date - 2022-08-31T17:39:32+05:30 IST

గత కొన్ని రోజులుగా ఎలాంటి అప్‌డేట్ లేని హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా నుంచి తాజాగా సర్‌ప్రైజింగ్ అప్‌డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా క్రిష్ (Krish)

Harihara Veeramallu: పవన్ బర్త్ డే సర్‌ప్రైజ్ రివీలైంది..

గత కొన్ని రోజులుగా ఎలాంటి అప్‌డేట్ లేని హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా నుంచి తాజాగా సర్‌ప్రైజింగ్ అప్‌డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా క్రిష్ (Krish) రూపొందిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోంది. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు - కుతుబ్ షాహీలకు సంబంధించిన చారిత్రక కథాంశంతో ఈ మూవీని అగ్ర నిర్మాత ఏ ఎం రత్నం (A M Ratnam) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 


ఈ సినిమాలో పవన్ పోషిస్తున్న వీరమల్లు పాత్ర రాబిన్ హుడ్ తరహా ఉంటుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన 'హరి హర వీరమల్లు' ఫస్ట్ లుక్, గ్లిమ్స్ అభిమానులను, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే, సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో పవన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ సర్ప్రైజింగ్ గిఫ్ట్‌తో రాబోతున్నారు. ఈ మూవీ నుంచి 'పవర్ గ్లాన్స్' పేరుతో ఓ స్పెషల్ వీడియోను విడుదల చేయనున్నారు. 


ఈ వీడియో సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం 05:45 గంటలకు విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది. గతకొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వస్తున్నాయి. అసలు షూటింగ్ కనీసం సగం అయినా పూర్తైందా..? అనే సందేహాలు చాలామందిలో కలుగుతున్నాయి. వాటన్నిటికీ త్వరలో రాబోతున్న 'పవర్ గ్లాన్స్'తో క్లారిటీ ఇవ్వబోతున్నారు. మరి ఈ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్‌కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. 



Updated Date - 2022-08-31T17:39:32+05:30 IST