కల్యాణ వైభోగమే...
ABN , First Publish Date - 2022-12-05T04:56:43+05:30 IST
కథానాయిక హన్సిక వివాహం ఆదివారం రాత్రి జైపూర్‌లోని ఓ రాజకోటలో జరిగింది. తన ప్రియుడు సోహైల్‌ని పెళ్లాడి హన్సిక కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు...

కథానాయిక హన్సిక వివాహం ఆదివారం రాత్రి జైపూర్‌లోని ఓ రాజకోటలో జరిగింది. తన ప్రియుడు సోహైల్‌ని పెళ్లాడి హన్సిక కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొన్నేళ్లుగా హన్సిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నారు. తన ప్రతీ పుట్టిన రోజున.. ఓ బాలికను దత్తత తీసుకోవడం ఆమెకు అలవాటు. అలా దత్తత తీసుకొన్న పిల్లలలు ఈ పెళ్లికి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.