‘గోలీ సోడా వే’ హల్‌చల్‌

ABN , First Publish Date - 2022-09-20T05:55:34+05:30 IST

మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఈశాన్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీ లియోన్‌ల గ్లామర్‌ అదనపు...

‘గోలీ సోడా వే’ హల్‌చల్‌

మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఈశాన్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీ లియోన్‌ల గ్లామర్‌ అదనపు ఆకర్షణ కానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా సోమవారం సోషల్‌ మీడియాలో  విడుదలైన  పెప్సీ డ్యాన్స్‌ నంబర్‌ ‘గోలీ సోడా వే’ అభిమానులను అలరిస్తోంది. ఈ పాటలో విష్ణు, పాయల్‌ రాజ్‌పుత్‌ పాల్గొన్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీత సారధ్యంలో నకాశ్‌ అజీజ్‌, నూతన మోహన్‌ ఈ పాట పాడారు. షూటింగ్‌ సమయంలో కాలుకు గాయమైనా, అద్భుతంగా డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌ చేయడంతో మంచు విష్ణు సోషల్‌ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన కుమార్తెలు అరియానా, వివియానా ఈ సినిమాతో సింగర్స్‌గా పరిచయం అవుతున్నారు. సైకాలజికల్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, వెన్నెల కిశోర్‌ కీలక  పాత్రలు పోషించారు.


Updated Date - 2022-09-20T05:55:34+05:30 IST