National Cinema Day: సినీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ. 75కే సినిమా చూడొచ్చు!

ABN , First Publish Date - 2022-09-21T16:49:07+05:30 IST

ఇప్పటివరకూ రూ.300 నుంచి రూ.400 వరకు ఉన్న సినిమా టిక్కెట్ ధర అంత తగ్గిందా.. అది జరగని పని అని అనుకుంటున్నారా...

National Cinema Day: సినీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ. 75కే సినిమా చూడొచ్చు!

ఇప్పటివరకూ రూ.300 నుంచి రూ.400 వరకు ఉన్న సినిమా టిక్కెట్ ధర అంత తగ్గిందా.. అది జరగని పని అని అనుకుంటున్నారా. కానీ.. ఇది నిజం. రూ.75కే సినిమా చూడొచ్చు. అయితే.. ప్రతిరోజు కాదులెండి. కేవలం సెప్టెంబర్ 23న మాత్రమే. ఆ రోజుల జాతీయ సినిమా దినోత్సవం (National Cinema Day). సినిమాలకి స్పెషల్ డే కావడంతో ది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (The Multiplex Association of India) ఈ ఆఫర్‌ని ప్రకటించింది. దీంతో టిక్కెట్ల అధిక ధర కారణంగా తమకి ఎంతో ఇష్టమైన సినిమాలని చూడలేకపోయిన ఎంతోమంది ఇప్పటికే టిక్కట్లను బుక్ చేసుకున్నారు. అందుకే ఆ రోజున ఉన్న అన్ని షోలకి సంబంధించి ఆన్‌లైన్‌లో ఫుల్ అని చూపించడం విశేషం. ఇది చూసిన పలువురు నెటిజన్లు ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్లకపోవడానికి కారణం ఓటీటీలు కాదని.. టిక్కెట్ల అధిక ధరలని కామెంట్స్ చేస్తున్నారు.


ఇందులో పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్, కార్నీవాల్, మిరజ్, సిటీ ప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2, మూవీ టైమ్, వేవ్, ఎమ్2కే, డిలైట్ చెందిన స్క్రీన్స్ ఉన్నాయి. అన్ని ప్రధాన నగరాల్లో ఈ మల్టీప్లెక్స్‌ల చైన్ కింద దేశవ్యాప్తంగా 4000కి పైగా స్క్రీన్స్ ఉండడం విశేషం. కోవిడ్ 19 తర్వాత థియేటర్స్‌కి వచ్చి సినిమా చూడాలంటే చాలామంది భయపడ్డారు. కొన్ని సినిమాల కారణంగా భారీ సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చారు. అందులో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ఛాప్టర్ 2, విక్రమ్, భూల్ భూలయ్యా 2 వంటి చిత్రాల ముఖ్యపాత్ర పోషించాయి. ప్రేక్షకులు మళ్లీ థియేటర్స్ రావడాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి జాతీయ సినిమా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. కాగా.. ఈ జాతీయ సినిమా దినోత్సవాన్ని సెప్టెంబరు 16న నిర్వహించాలని ముందుగా అనుకున్నారు. దాని గురించి ప్రకటన కూడా చేశారు. కానీ.. పలువురి మెంబర్ల  అభ్యర్థన మేరకు ఎమ్‌ఏఐ సెప్టెంబర్ 23కి రీషెడ్యూల్ చేసింది.

Updated Date - 2022-09-21T16:49:07+05:30 IST