దుల్ఖర్ యుద్దంతో రాసిన ప్రేమకథ టైటిల్ ఇదే..

ABN , First Publish Date - 2022-04-10T19:35:46+05:30 IST

మలయాళ యంగ్ సూపర్ స్టార్ దుల్ఖర్ సల్మా్న్ హీరోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ వెరైటీ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘మహానటి’ తర్వాత దుల్ఖర్ సల్మాన్ నటిస్తోన్న మరో స్ట్రైట్ తెలుగు మూవీ ఇదే అవవడం విశేషం. వైజయంతి మూవీస్ సమర్పణలో, స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందణ్ణ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక ఈ సినిమాకి ‘సీతా రామం’ అనే క్యాచీ టైటిల్‌ ను.. నేడు (ఏప్రిల్ 10) శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రకటించారు. ఆకట్టుకొనే పోస్టర్ ను ఈ సందర్భంగా షేర్ చేశారు. అలాగే అదిరిపోయే ఓ గ్లింప్స్ వీడియోను కూడా విడదుల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దుల్ఖర్ యుద్దంతో రాసిన ప్రేమకథ టైటిల్ ఇదే..

మలయాళ యంగ్ సూపర్ స్టార్ దుల్ఖర్ సల్మాన్ హీరోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ వెరైటీ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘మహానటి’ తర్వాత దుల్ఖర్ సల్మాన్ నటిస్తోన్న మరో స్ట్రైట్ తెలుగు మూవీ ఇదే అవవడం విశేషం. వైజయంతి మూవీస్ సమర్పణలో, స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందణ్ణ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక ఈ సినిమాకి ‘సీతా రామం’ అనే క్యాచీ టైటిల్‌ ను.. నేడు (ఏప్రిల్ 10)  శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రకటించారు. ఆకట్టుకొనే పోస్టర్ ను ఈ సందర్భంగా షేర్ చేశారు. అలాగే అదిరిపోయే ఓ గ్లింప్స్ వీడియోను కూడా విడదుల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


రష్మికా మందణ్ణ ముస్లీమ్ అమ్మాయిగా వీడియోలో రివీల్ అయింది. హీరో దుల్ఖర్ .. హీరోయిన్ మృణాల్ ఠాకూర్  తొలి పరిచయం ఈ వీడియోకే హైలైట్. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇందులో దుల్ఖర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ గా నటిస్తున్నారు. యుద్ధానికి సన్నద్ధమైన ఓ సైనికుడు ఓ అందమైన అమ్మాయితో  ప్రేమలో పడితే..  ఎలా ఉంటుంది ? అన్న ఆలోచనకి తెరరూపమే ఈ సినిమా. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. 



Updated Date - 2022-04-10T19:35:46+05:30 IST