Samantha: సామ్‌కు అండగా సెలబ్రిటీలు
ABN , First Publish Date - 2022-10-30T01:17:37+05:30 IST
సమంత (Samantha) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుందని, అందువల్లే సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై సామ్ స్పందించింది. తాను ‘మయోసైటిస్’ (Myositis) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపింది.
సమంత (Samantha) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుందని, అందువల్లే సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై సామ్ స్పందించింది. తాను ‘మయోసైటిస్’ (Myositis) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపింది. ఈ పోస్ట్‌ను షేర్ చేసిన కాసేపటికే అనేక మంది సెలబ్రిటీలు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కష్టకాలంలో ఆమెకు అండగా నిలిచారు.
‘‘నువ్వు త్వరగా కోలుకోని తిరిగి బలంగా రావాలి సామ్’’ అని జూనియర్ ఎన్‌టీఆర్ (Junior NTR) తెలిపాడు. ‘‘నువ్వు మరింత బలంతో తిరిగి పుంజుకొని రావాలి సామ్’’ అని కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) చెప్పింది. ‘‘నువ్వు చెప్పినట్టు దీనిని కూడా జయించాలి’’ అని దల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) పేర్కొన్నాడు. ‘‘ఎప్పటి లాగానే మరింత బలంతో తిరిగి రావాలి’’ అని రామ్ పోతినేని (Ram Pothineni) వెల్లడించాడు. ‘‘టేక్ కేర్ సామ్’’ అని రాశీ ఖన్నా రిప్లై ఇచ్చింది. ‘‘వెల్ కం బ్యాక్ సామ్’’ అని ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ అండ్ డీకే పోస్ట్ పెట్టారు. నందిని రెడ్డి, శ్రియా శరణ్, సుస్మిత కొణిదెల, నీరజ కోన తదితరులంతా సమంత కోలుకోని తిరిగి మరింత బలంతో రావాలని ఆశించారు. అంతకు ముందు సమంత ‘యశోద’ కు డబ్బింగ్ చెబుతున్న ఫొటోను షేర్ చేస్తూ సుదీర్ఘంగా పోస్ట్ పెట్టింది. ఈ పిక్‌లో సామ్ చేతికి సెలైన్ ఉండటం గమనార్హం. ‘‘.. ‘యశోద’ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. జీవితం ముగింపులేని సవాళ్లను నా ముందు ఉంచింది. అభిమానులు చూపిస్తున్న ప్రేమ, అభిమానం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలలుగా నేను అనారోగ్యంతో బాధపడుతున్నా. ‘మయోసైటిస్’ (Myositis) అనే ఆటో ఇమ్యూనిటీ సమస్యకు చికిత్స తీసుకుంటున్నా. ఈ విషయాన్ని ఎప్పుడో తెలియజేయాలనుకున్నా. కానీ, నేను కోలుకోవడానికి ఆలస్యమవుతుంది. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. త్వరలోనే ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకుంటాను. జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. ఎలాగో క్షణాలు గడుస్తున్నాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఐ లవ్ యూ’’ అని సమంత ట్వీట్ చేసింది. ప్రస్తుతం సమంత నటించిన ‘యశోద’, ‘శాకుంతలం’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘యశోద’ ట్రైలర్ ఈ మధ్యనే విడుదలైంది. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 11న విడుదల కానుంది.