Butta Bomma: మరో మలయాళం రీమేక్ 'బుట్టబొమ్మ'
ABN , First Publish Date - 2022-11-07T18:53:05+05:30 IST
ఈమధ్య తెలుగు సినిమాలు బాగా తగ్గిపోయాయి. మలయాళం సినిమా రీమేక్ చెయ్యడమో, కొరియన్ సినిమా రీమేక్ చెయ్యడమో లేదా ఇంకో భాషలో హిట్ అయిన సినిమాని తీసుకొని రీమేక్ చెయ్యడమో, మొత్తానికి ఎక్కువ రీమేక్ సినిమాలే
ఈమధ్య తెలుగు సినిమాలు బాగా తగ్గిపోయాయి. మలయాళం సినిమా రీమేక్ చెయ్యడమో, కొరియన్ సినిమా రీమేక్ చెయ్యడమో లేదా ఇంకో భాషలో హిట్ అయిన సినిమాని తీసుకొని రీమేక్ చెయ్యడమో, మొత్తానికి ఎక్కువ రీమేక్ సినిమాలే విడుదల అవుతున్నాయి. ఇప్పుడు అదే కోవలోకి వస్తోంది 'బుట్ట బొమ్మ' (#ButtaBomma is a remake of Malayalam film #Kappela) అనే సినిమా. ఇది కూడా విడుదల కి రెడీ గా వుంది. ఇది మలయాళం సినిమా 'కప్పేలా' అనే సినిమాకి రీమేక్. ఆ సినిమా ఓ.టి.టి. కి పనికొస్తుంది కానీ, థియేటర్స్ లో అయితే ఎవరూ చూరరు అని పరిశ్రమలో ఒక టాక్. ఎందుకంటే అప్పుడెప్పుడో ఓ.టి.టి లో వచ్చిన ఆ సినిమాని అందరూ చూసేసారు. మళ్ళీ అదే సినిమాని, సితార ఎంటర్ టైన్ మెంట్ వాళ్ళు తెలుగులో 'బుట్ట బొమ్మ' పేరుతో రీమేక్ చేసారు. దీనికి శౌరి చంద్రశేఖర్, రమేష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు.
ఈ సినిమా టీజర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ (#TrivikramSrinivasBirthday) పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు. మరి త్రివిక్రమ్ కి ఈ సినిమాకి ఏంటి సంబంధం అంటారా, త్రివిక్రమ్ శ్రీనివాస్ కి చెందిన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ (#FortuneFourCinemas is owned by Trivikram Srinivas and his wife Sai Soujanya is the producer for this #ButtaBomma) సంస్థ కూడా ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్ గా వుంది. అందుకే నిర్మాతలుగా నాగ వంశి, సాయి సౌజన్య పేర్లు వేశారు. అయితే త్రివిక్రమ్ నిర్మాతగా వున్నారు కాబట్టి ఈ సినిమా కొంచెం బాగుంటుంది అని అనుకోవచ్చు. అయితే సినిమా విడుదలకి ముందే ఈమధ్య ఓ.టి.టి మరియు శాటిలైట్ హక్కుల ద్వారా డబ్బులు వచ్చేస్తున్నాయి. అందుకని ఇలాంటి చిన్న సినిమాలు థియేటర్స్ లో ఆడినా ఆడకపోయినా పరవాలేదు. అందుకే కొత్తవాళ్ళని పెట్టి తీసినట్టున్నారు. అనేక సురేంద్రన్, అర్జున్ దాస్ మరియు సూర్య వశిష్టా ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.