NBK108: బాలకృష్ణకు విలన్‌గా బాలీవుడ్ నటుడు..!

ABN , First Publish Date - 2022-11-17T20:47:17+05:30 IST

పౌరాణిక పాత్రలు, మాస్, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna). ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’ లో నటిస్తున్నారు. బాలయ్య ఈ సినిమాను చేసిన వెంటన్.. అనిల్ రావిపూడి (Anil Ravipudi) తో ఓ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. ఈ మూవీలో బాలయ్యకు విలన్‌గా బాలీవుడ్ నటుడు నటించనున్నారని వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి.

NBK108: బాలకృష్ణకు విలన్‌గా బాలీవుడ్ నటుడు..!

పౌరాణిక పాత్రలు, మాస్, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna). ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’ లో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య ఈ సినిమాను చేసిన వెంటన్.. అనిల్ రావిపూడి (Anil Ravipudi) తో ఓ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. ఈ మూవీకి ‘ఎన్‌బీకే 108’ (NBK 108) అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ‘ఎన్‌బీకే 108’ కు సంబంధించి తాజాగా ఓ రూమర్ ఫిల్మ్‌నగర్‌లో షికారు కొడుతుంది. ఈ మూవీలో బాలయ్యకు విలన్‌గా బాలీవుడ్ నటుడు నటించనున్నారని వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. 


బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun Rampal) ‘ఎన్‌బీకే 108’ లో బాలకృష్ణకు విలన్‌గా నటించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. మేకర్స్ అర్జున్‌ను సంప్రదించగా నటించడానికి అంగీకారం తెలిపారని సమాచారం అందుతుంది. అనిల్ రావిపూడి తెరకెక్కించే ఈ ప్రాజెక్టు.. క్యారెక్టర్ బేస్డ్ చిత్రమని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలయ్య పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నారట. ఈ మూవీలో హీరో కుమార్తె పాత్ర చాలా కీలకం. ఈ పాత్రలో ప్రముఖ యువనటి శ్రీ లీల కనిపించనున్నారు. షైన్ స్క్రీన్స్ ఈ మూవీని నిర్మించనుంది. ఇక బాలకృష్ణ కెరీర్ విషయానికి వస్తే.. హిట్, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా యంగ్ డైరెక్టర్స్ అందరికి అవకాశాలిస్తున్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌ పాత్రను పోషిస్తున్నారు. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తారు. ఈ చిత్రానికి ‘ఐ డేంట్ కేర్’ టైటిల్ ప్రచారంలో ఉంది.



Updated Date - 2022-11-17T20:47:17+05:30 IST