Naagali: రైతుల తిరుగుబాటు నేపథ్యంలో..

ABN , First Publish Date - 2022-11-28T21:01:46+05:30 IST

1995లో ‘తపస్సు’ అనే సినిమాలో నటించిన ప్రముఖ దర్శకుడు భరత్ పారేపల్లి (Bharath Parepalli).. మళ్లీ 27 సంవత్సరాల తరువాత ఒక రైతుగా..

Naagali: రైతుల తిరుగుబాటు నేపథ్యంలో..

1995లో ‘తపస్సు’ అనే సినిమాలో నటించిన ప్రముఖ దర్శకుడు భరత్ పారేపల్లి (Bharath Parepalli).. మళ్లీ 27 సంవత్సరాల తరువాత ఒక రైతుగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ది డ్రీమ్స్ కంపెనీ బ్యానర్‌పై శ్రీమతి పావని మొక్కరాల సమర్పణలో తెరకెక్కిస్తోన్న చిత్రం `నాగలి’ (Naagali). ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (Naagali Movie Update)


ఈ సందర్భంగా దర్శకనిర్మాత  భరత్ పారేపల్లి మాట్లాడుతూ.. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో  నూతన నటీనటులతో చిత్రీకరణ జరిపాము. ఈ సినిమాతో కథానాయకుడు సుదీప్ మొక్కరాల నిడదవోలు, కథానాయకిగా ముంబైకి చెందిన అనుస్మతి సర్కార్.. హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఎంఎల్ రాజా సంగీతం అందిస్తున్నారు. రైతుల ఆత్మహత్యలు.. వాళ్ళ  కథలు, వెతలతో.. 1857, 58ల మధ్య జరిగిన సిపాయిల తిరుగుబాటును తలపించేలా.. రైతుల తిరుగుబాటు నేపథ్యంతో ఈ సినిమా ఉంటుంది. నేను కూడా ఓ ఛాలెంజింగ్ పాత్రలో నటించాను. నెల రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరిపాము. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరిలో ఆడియో విడుదల చేసి ఫిబ్రవరిలో సినిమాని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2022-11-28T21:01:46+05:30 IST