Babloo Prithiveeraj: తన కంటే 32 ఏళ్ల తక్కువ వయసున్న అమ్మాయితో మళ్లీ పెళ్లి

ABN , First Publish Date - 2022-10-29T20:49:01+05:30 IST

‘పెళ్లి’(Pelli fame), ‘పెళ్లి పందిరి’, ‘చెన్నకేశవరెడ్డి, ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘సంతోషం’ వంటి చిత్రాలతో తెలుగువారికి చేరువయ్యారు నటుడు పృథ్వీరాజ్‌(Babloo Prithiveeraj). తెలుగు సినిమాలకు కొంత గ్యాప్‌ ఇచ్చిన ఆయన ఈ మధ్యకాలంలో అడపాదడపా అవకాశాలు అందుకొంటున్నారు.

Babloo Prithiveeraj: తన కంటే 32 ఏళ్ల తక్కువ వయసున్న అమ్మాయితో మళ్లీ పెళ్లి

‘పెళ్లి’(Pelli fame), ‘పెళ్లి పందిరి’, ‘చెన్నకేశవరెడ్డి, ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘సంతోషం’ వంటి చిత్రాలతో తెలుగువారికి చేరువయ్యారు నటుడు పృథ్వీరాజ్‌(Babloo Prithiveeraj). తెలుగు సినిమాలకు కొంత గ్యాప్‌ ఇచ్చిన ఆయన ఈ మధ్యకాలంలో అడపాదడపా అవకాశాలు అందుకొంటున్నారు. టీవీ షోల్లోనూ దర్శనమిస్తున్నారు. ఆయన ఓ అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! దీనిపై ఆయన స్పందించారు.   పెళ్లి గురించి వస్తోన్న వార్తల్లో నిజం లేదని అన్నారు. కానీ ఓ అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నట్ల  చెప్పుకొచ్చారు.  ‘‘నా రెండో పెళ్లి గురించి వస్తోన్న వార్తల ఆధారంగా విపరీతంగా టోల్స్‌ చేస్తున్నారు. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను రెండో పెళ్లి చేసుకున్నట్లు విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలో నిజం లేదు.  24 ఏళ్ల షీతల్‌ (Sheetal)అనే అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నా. త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. న మొదటి భార్య బీనాతో ఆరేళ్లగా వివాదం జరుగుతోంది. అందుకే బయటకు వచ్చేసి ఆమెకు దూరంగా ఉంటున్నా. ఒంటరితనం మనిషిని ఎంతగా కుంగదీస్తుందో నాకు తెలుస్తుంది. ఎందుకంటే నేను ఆ బాధను అనుభవించా. అలాంటి సమయంలో షీతల్‌తో పరిచయం ఏర్పడింది. మా మనస్తత్వాలు, అభిరుచులు కలిశాయి.  ఫ్రెండ్స్‌ అయ్యాం.. ప్రస్తుతం రిలేషన్‌లో ఉన్నాం’’ అని పృథ్వీరాజ్‌ చెప్పారు. వయసు కేవలం నంబర్‌ మాత్రమేనని ఇంట్లో వాళ్లు అందరి అంగీకారంతోనే పృథ్వీని పెళ్లి చేసుకోబోతునట్లు షీతల్‌ తెలిపారు. (Prithiveeraj second marriage with 24 year girl)



Updated Date - 2022-10-29T20:49:01+05:30 IST