AliaBhatt: కుమార్తె పేరును తెలిపిన ఆలియా భట్
ABN , First Publish Date - 2022-11-25T02:39:26+05:30 IST
సెలబ్రిటీ కపుల్ ఆలియాభట్ (AliaBhatt), రణ్‌బీర్‌కపూర్ (Ranbir Kapoor)లు పండంటి బుజ్జాయికి జన్మనిచ్చిన సంగతి తెలసిందే.

సెలబ్రిటీ కపుల్ ఆలియాభట్ (AliaBhatt), రణ్‌బీర్‌కపూర్ (Ranbir Kapoor)లు పండంటి బుజ్జాయికి జన్మనిచ్చిన సంగతి తెలసిందే. ఈ దంపతులు తమ కుమార్తెకు రాహా (Raha) అని పేరు పెట్టినట్టు సోషల్ మీడియాలో తెలిపారు. ఈ పేరును రాహా నాన్నమ్మ (నీతూ కపూర్) సూచించిందని చెప్పారు. రాహాకు అనేక అర్థాలు ఉన్నాయని చెప్పారు. ఆ అర్థాలన్నింటిని వివరించారు.
రాహా అంటే దైవ మార్గామని, స్వాహిలీ భాషలో ఆనందమని, సంస్కృతంలో వంశమని, బెంగాలీలో విశ్రాంతి, సౌకర్యం, ఉపశమనం, అరబిక్‌లో శాంతి, సంతోషం, స్వేచ్ఛ, ఆనందం అని చెప్పారు. రాహా రాకతో తమ జీవితం కొత్తగా ప్రారంభమైందని ఈ జంట ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాప పేరును తెలిపిన వెంటనే అనేక మంది సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పారు. పేరు బాగుందని తెలిపారు. ఆలియా నవంబర్ 6న పండంటి బుజ్జాయికి జన్మనిచ్చింది. ఆలియాకు రణ్‌బీర్‌తో ‘బ్రహ్మస్త్ర’ షూటింగ్ సమయంలో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు.