Vicky Kaushal: బాలీవుడ్ సినిమాల ఫెయిల్యూర్‌కు కారణమిదే!
ABN , First Publish Date - 2022-12-25T18:44:30+05:30 IST
సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి విక్కీ కౌశల్ (Vicky Kaushal). చిన్న పాత్రలతో కెరీర్‌ను ప్రారంభించి అనంతరం హీరోగా మారాడు. ‘సర్దార్ ఉద్దం’, ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు.
సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనేది లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి విక్కీ కౌశల్ (Vicky Kaushal). చిన్న పాత్రలతో కెరీర్‌ను ప్రారంభించి అనంతరం హీరోగా మారాడు. ‘సర్దార్ ఉద్దం’, ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ‘గోవిందా నామ్ మేరా’ (Govinda Naam Mera) లో నటించాడు. ఈ చిత్రం నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో రిలీజ్ అయింది. ప్రేక్షకుల మెప్పు పొందింది. తాజాగా విక్కీ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు. బాలీవుడ్ సినిమాల ఫెయిల్యూర్ గురించి మాట్లాడాడు.
బాలీవుడ్‌లో ఈ ఏడాది అనేక చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. స్టార్ హీరోలు నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’, ‘రక్షా బంధన్’, ‘షంషేరా’, ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ వంటి సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరించలేదు. అందుకు గల కారణాన్ని విక్కీ కౌశల్ వివరించాడు. ‘‘మంచి సినిమాలు థియేటర్స్‌లో నడుస్తున్నాయి. కంటెంట్ బాగుంటెనే చూస్తామని ప్రేక్షకులు సిగ్నల్ ఇస్తున్నారు. భాష, జోనర్ లతో సంబంధం లేకుండా ఆదరిస్తామని ప్రేక్షకులు చెబుతున్నారు. ‘భూల్ భూలయ్యా 2’, ‘కెజియఫ్ 2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘దృశ్యం 2’ వంటి చిత్రాలన్నింటిని ఒకే గాటిన కట్టలేం. ఎందుకంటే అవి వేర్వేరు భాషలు, జోనర్స్‌కు చెందినవి. వాటి మార్కెటింగ్ ప్లాన్ కూడా వేరు. మూడేళ్ల క్రితం సినిమాను ఎంత మార్కెటింగ్ చేస్తే అంత బాగా ఆడేది. కానీ, ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవు. నేడు కంటెంట్ బాగున్న చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’’ అని విక్కీ కౌశల్ చెప్పాడు. ఇక విక్కీ కౌశల్ కెరీర్ విషయానికి వస్తే.. లక్ష్మణ్ ఉత్కేర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సామ్ బహదూర్ మూవీలోను నటిస్తున్నాడు. ఈ చిత్రం ఫీల్డ్ మార్షల్ సామ్ మానెషా జీవితం ఆధారంగా రూపొందుతుంది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తుంది.