Tapsee: నన్ను మెచ్చుకోవలసిన అవసరం లేదు!
ABN , First Publish Date - 2022-12-16T17:23:19+05:30 IST
తాప్సీ ఏదైనా ముక్కుసూటిగా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. ‘దోబారా’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె విలేకర్లు అడిగిన ప్రశ్నల పట్ల అసహనం వ్యక్తం చేశారు. ‘మీ సినిమాని బాయ్‌కాట్ చేయమని నెటిజన్లు అంటున్నారు?
తాప్సీ (Tapsee)ఏదైనా ముక్కుసూటిగా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. ‘దోబారా’ (Dhobara)ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె విలేకర్లు అడిగిన ప్రశ్నల పట్ల అసహనం వ్యక్తం చేశారు. ‘మీ సినిమాని బాయ్‌కాట్ చేయమని నెటిజన్లు అంటున్నారు?’ అని అడగ్గా... ‘మీరు చెప్పండి ఏ సినిమా బాయ్‌కాట్ ఎదుర్కొవడం లేదో. ప్రశ్నలు అడిగే ముందు కాస్త హోం వర్క్ చేసుకుని రండి? అని ఘాటుగా సమాధానమిచ్చారు. మరో ఇంటర్వ్యూలోనూ అలాగే ఘాటుగా స్పందించారు. దీంతో ఆ వీడియోలు వైరల్‌గా మారడంతో తాప్సీకి పొగరు పెరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేశారు. దీనికి ఆమె స్పందిస్తూ ‘‘కొంతమంది నటీనటుల లాగా కెమెరా ముందు నటించినట్లు బయట నటించలేను. కెమెరా ముందు ఒక రకంగా, వెనుక మరొక విధంగా ఉండటం నాకు చేతకాదు, నిజయతీగా ఉండటమే తెలుసు. నా మాటలు నచ్చని చాలామంది సోషల్ మీడియా వేదికగా ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడారు. నేను చాలా బాధపడ్డా. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, నాపై వచ్చే వార్తల గురించి వెతకకూడదని నిర్ణయించుకున్నా. ఎదుటివారి పొగడ్తల కోసం నేను ఆరాటపడను. నాకు నచ్చినట్లు ఉంటాను. ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు నా మనసుకు అనిపించింది మనస్ఫూర్తిగా మాట్లాడతాను. సమాజంలో మంచిగా పేరు తెచ్చుకోవడానికి కొంతమంది స్టార్స్ బయట నటిస్తుంటారు. అలాంటి వారి గురించి నిజాలు బయటకు తెలిసినప్పుడు ప్రజల్లో వారి గౌరవం దెబ్బ తింటుంది. అందరికీ నేను నచ్చాలని లేదు. కాబట్టి, నటిగా నా వర్క్‌ని వాళ్లు మెచ్చుకుంటే చాలు’’ అని తాప్సీ పేర్కొన్నారు.