Pathaan: షారూఖ్ సినిమాకు వ్యతిరేకంగా ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-12-16T18:47:55+05:30 IST

షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan), దీపికా పదుకొణె (Deepika Padukone) హీరో, హీరోయిన్‌గా నటించిన సినిమా పఠాన్ (Pathaan). సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది.

Pathaan: షారూఖ్ సినిమాకు వ్యతిరేకంగా ఫిర్యాదు

షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan), దీపికా పదుకొణె (Deepika Padukone) హీరో, హీరోయిన్‌గా నటించిన సినిమా పఠాన్ (Pathaan). సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా పాటలను విడుదల చేయడం మొదలుపెట్టారు. తొలి పాట ‘బే శరమ్’ విడుదల కాగానే వివాదాల్లో చిక్కుకుంది. ఈ సాంగ్‌లో దీపిక ధరించిన దుస్తులపై అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు న్యాయవాది ఒకరు తాజాగా ఈ సినిమాకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు.

సుప్రీం కోర్టు లాయర్ వినీత్ జిందాల్ (Vineet Jindal) పఠాన్ చిత్రానికి వ్యతిరేకంగా సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. ఈ పాటలో నటీ, నటులు అభ్యంతరకరంగా కనిపించారని చెప్పారు. సాంగ్‌ను సరిచేసి విడుదల చేయాలన్నారు. అప్పటి వరకు చిత్రంపై బ్యాన్ విధించాలన్నారు. ‘‘పాట అభ్యంతరకరంగా ఉంది. దీపిక పదుకొణె కాషాయ రంగు బికినీని ధరించింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ పాట కొనసాగింది. దీపికా పదుకొణె, షారూఖ్ ఖాన్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఐటీ యాక్ట్‌లోని సెక్షన్స్ 67, 295ఏ, 298, 505 కింద, ఐపీసీ 34కింద కేసును నమోదు చేయాలి. ఈ వీడియోపై నిషేధం విధించాలి. సోషల్ మీడియా నుంచి కూడా తొలగించాలి’’ అని వినీత్ జిందాల్ లేఖలో ఉన్నారు. అంతకు ముందు.. విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. దీపికా పదుకొణె ధరించిన దుస్తులపై విరుచుకుపడ్డాడు. అయోధ్యలోని హనుమాన్ గడీ మహంత్ రాజు దాస్ ‘పఠాన్’ ను ప్రదర్శించే థియేటర్స్‌ని తగుల బెట్టాలన్నారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా కూడా ఈ చిత్రంపై విరుచుకుపడ్డారు.

Updated Date - 2022-12-16T18:47:58+05:30 IST