సర్జరీలు చేయించుకున్న బాలీవుడ్ హీరోల లిస్ట్ ఇదీ.. ఒకరిద్దరు కాదండోయ్.. ఏకంగా ఏడుగురు టాప్ హీరోలు..!
ABN , First Publish Date - 2022-05-11T23:26:09+05:30 IST
హీరో అంటే ఆరడుగుల ఎత్తు ఉండాలి. సిక్స్‌ప్యాక్‌తో కనిపించాలి. ఆరు పదుల వయసు వచ్చిన నెరసిన జుట్టుతో కనిపించకూడదు. సినిమా హీరోలను చూసేందుకే కొన్ని సార్లు అభిమానులు థియేటర్లకు వస్తారంటే అతిశయోక్తి లేదు

హీరో అంటే ఆరడుగుల ఎత్తు ఉండాలి. సిక్స్‌ప్యాక్‌తో కనిపించాలి. ఆరు పదుల వయసు వచ్చిన నెరసిన జుట్టుతో కనిపించకూడదు. సినిమా హీరోలను చూసేందుకే కొన్ని సార్లు అభిమానులు థియేటర్లకు వస్తారంటే అతిశయోక్తి లేదు. అందువల్ల నటులు ఎల్లప్పుడు లుక్స్‌కు ప్రాధాన్యమిస్తుంటారు. అవసమైతే సర్జరీలు కూడా చేయించుకుంటారు. అలా హ్యాండ్సమ్గా కనిపించడానికీ కొంత మంది బాలీవుడ్ హీరోలు సర్జరీలు చేయించుకున్నారు. అటువంటి వారి జాబితాపై ఓ లుక్కేద్దామా..
షారూఖ్ ఖాన్:
బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). అభిమానులు ముద్దుగా బాద్ షా అని పిలుస్తుంటారు. ‘చెన్నై ఎక్స్ ప్రెస్’(Chennai Express) , ‘డాన్’ (Don) వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. షారూక్ బొటాక్స్ ట్రీట్మెంట్తో పాటు, యంగ్‌గా కనిపించడానికీ కొన్ని ఇంజెక్షన్లను కూడా తీసుకున్నాడు. ముడతలను తగ్గించడానికీ బొటాక్స్ ఇంజక్షన్స్ తీసుకుంటుంటారు. ఎక్కడ ముడతలు తగ్గాలనుకుంటే ఇంజక్షన్‌ను అక్కడ చొప్పిస్తారు.

షాహిద్ కపూర్:
మహిళ ప్రేక్షకుల మదిని దోచిన హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor). షాహిద్‌ని గతంలో అందరు చాక్లెట్ బాయ్ అని పిలిచేవారు. ‘హైదర్’ (haider) ‘కబీర్ సింగ్’ (kabir singh)వంటి సినిమాల్లో నటించి అభిమానులను ఫిదా చేశాడు. అతడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.

సల్మాన్ ఖాన్:
ఏ సినిమా చేసిన బాలీవుడ్లో అలవోకగా రూ. 100కోట్ల వసూళ్లను సాధించే వ్యక్తి సల్మాన్ ఖాన్(Salman Khan). ‘దబాంగ్’ (Dabangg), ‘టైగర్’ (Tiger) ప్రాంచైజీలతో ప్రేక్షకులను మెప్పించాడు. సల్మాన్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్‌తో పాటు, బొటాక్స్ సర్జరీ చేయించుకున్నాడు.

ఆమిర్ ఖాన్:
లేటుగా వచ్చిన లేటెస్ట్గా వస్తానంటాడు ఆమిర్ ఖాన్ (Aamir Khan). రెండు, మూడేళ్లకు ఒక సినిమా చేసిన రికార్డులను తిరగరాస్తుంటాడు. అభిమానులందరు ముద్దుగా ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అని పిలుస్తారు. ‘3 ఇడియట్స్’ (3 idiots), ‘పీకే’ (PK) వంటి సినిమాలతో సినీ ప్రేక్షకులను అలరించాడు. ముఖంపై ముడతలను తగ్గించుకోవడానికీ కాస్మోటిక్ సర్జరీని ఆశ్రయించాడు.

అక్షయ్ కుమార్:
ప్రతి ఏడాది ఐదు నుంచి ఆరు సినిమాలు చేసే వ్యక్తి అక్షయ్ కుమార్ (Akshay Kumar). ఆరవై రోజుల్లోపే సినిమాలు పూర్తి చేయాలంటాడు. ‘బేబీ’ (Baby), ‘బచ్చన్ పాండే’ (Bachchan Pandey) చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచాడు. అక్కీ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాడు.

రణ్‌బీర్ కపూర్:
‘సావారియా’ (Saawariya) సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor). ‘సంజు’ (sanju) చిత్రంతో రూ. 300కోట్ల వసూళ్లను రాబట్టాడు. పెళ్లికి ముందే రణ్‌బీర్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాడు.

సైఫ్ అలీఖాన్:
హీరోగా మాత్రమే కాకుండా విభిన్న పాత్రలు పోషించే నటుడు సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan). హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం హిందీ ‘విక్రమ్ వేద’ (vikram vedha)లో నటిస్తున్నాడు. అతడు బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు.
