Shah Rukh Khan: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్‌లో పఠాన్ ప్రమోషన్స్

ABN , First Publish Date - 2022-12-15T19:28:31+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). చివరగా జీరో (Zero) సినిమాలో నటించాడు. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది.

Shah Rukh Khan: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్‌లో పఠాన్ ప్రమోషన్స్

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). చివరగా జీరో (Zero) సినిమాలో నటించాడు. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. మేకర్స్‌కు భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో చిత్రాలకు కొంచెం బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. కొన్నేళ్ల తర్వాత వెండి‌తెర మీద కనిపిస్తుండటంతో రాబోయే సినిమా ప్రమోషన్స్‌ను భారీగా చేయాలని నిర్ణయించుకున్నాడు.

షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘పఠాన్’ (Pathaan). దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ బడా డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా ఇప్పటికే పాటలను విడుదల చేస్తున్నారు. మూవీకి భారీ బజ్ తీసుకురావాలని కింగ్ ఖాన్ ఆలోచనలో ఉన్నాడు. అందులో భాగంగా ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్స్‌లో సినిమాను ప్రమోట్ చేయనున్నాడు. అందుకు సంబంధించిన విషయాలను తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌ను షేర్ చేశాడు. ‘‘పీల్డ్‌లో మెస్సీ, ఎంబపె.. స్టూడియోలో నేను, వేన్ రూనీ.. 18డిసెంబర్ సాయంత్రం అద్భుతంగా ఉంటుంది. ఫిపా వరల్డ్ కప్ ఫైనల్స్‌ను నాతో కలసి చూడండి’’ అని షారూఖ్ ఖాన్ పోస్ట్‌ను షేర్ చేశాడు. ‘పఠాన్’ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా ఫైనల్స్‌లో సందడి చేయనుంది. ట్రోపీని అవిష్కరించాలని ఆమెకు ఆహ్వానం అందింది. ఇక షారూఖ్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. ‘జవాన్’ లో నటిస్తున్నాడు. సౌత్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. 2023 జూన్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో ‘ఢంకీ’ లో నటించాడు. క్రిస్‌మస్ కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Updated Date - 2022-12-15T19:31:31+05:30 IST