ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?

ABN , First Publish Date - 2022-04-26T01:08:21+05:30 IST

కశ్మీర్ పండిట్‌లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?

కశ్మీర్ పండిట్‌లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద  సంచలన విజయం సాధించింది. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్స్‌లో కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకీ రానుంది. 


‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం మే 13 నుంచి ‘జీ-5’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. ఈ మూవీకి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించాడు. జీ స్టూడియోస్‌తో కలసి అభిషేక్ అగర్వాల్ నిర్మించాడు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘‘కశ్మీర్ పండిట్‌లపై సాగిన సామూహిక హత్యకాండను ‘ది కశ్మీర్ ఫైల్స్’లో చూపించారు. కొన్నేళ్ల క్రితం భారత్‌లో జరిగిన ఈ కథ చాలా మందికి తెలియదు. దేశ వ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రశంసలు లభించాయి. వెండి‌తెర మీద ఈ మూవీని వీక్షించనివారు.. జీ-5లో చూడవచ్చు’’అని ఆ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. 



Updated Date - 2022-04-26T01:08:21+05:30 IST