టాలీవుడ్లో ఆ హీరోలు, దర్శకుడితో పనిచేయాలనుంది : దీపికా పదుకొణె
ABN , First Publish Date - 2022-02-11T23:14:43+05:30 IST
బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే తారల్లో దీపికా పదుకొణె ఒకరు

బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే తారల్లో దీపికా పదుకొణె ఒకరు. పలు చిత్రాల్లో స్టార్ హీరోల సరసన ఆమె నటించింది. తాజాగా ఆమె ‘‘గెహ్రాయియా’’ అనే సినిమాలో నటించింది. అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 11నుంచి ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లల్లో భాగంగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. పలు ఆసక్తికర విషయాలను అభిమానులకు తెలిపింది.
ఇంటర్వ్యూలో భాగంగా టాలీవుడ్లో ఏ హీరోతో నటించాలని ఉందనగా ఆమె ఆసక్తికర సమాధానమచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో నటించే అవకాశం వస్తే సంతోషిస్తానని చెప్పింది. ఏ దర్శకుడి సినిమాలో నటించాలని ఉందని అడగగా... అయాన్ ముఖర్జీ, ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేయాలనుందని పేర్కొంది. గతంలో దీపిక నటించిన ‘యే జవానీ హై దీవానీ’ మూవీకి అయాన్ ముఖర్జీయే దర్శకత్వం వహించడం విశేషం. కాగా, డీపీ లెటెస్ట్ మూవీ ‘గెహ్రాయియా’ చిత్రానికి శకున్ బత్రా దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో అనన్య పాండే, సిద్దార్థ్ చతుర్వేది కీలక పాత్రలు పోషించారు.