పెళ్లి చేసుకున్న అలియా భట్- రణ్‌బీర్ కపూర్
ABN , First Publish Date - 2022-04-15T01:12:21+05:30 IST
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ అలియా భట్-రణ్‌బీర్ కపూర్ పెళ్లి చేసుకున్నారు. ఈ బీ-టౌన్ గ్లామరస్ జోడీ ఏప్రిల్ 14న కొత్త జీవితాన్ని ప్రారంభించింది. రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసమైన ‘వాస్తు’లో వీరి వివాహం కోలాహలంగా ముగిసింది. బాలీవుడ్ హై ప్రొఫైల్ వెడ్డింగ్‌కి నీతూ కపూర్, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, మహేశ్ భట్, సోనీ రజ్దాన్, షాహీన్ భట్, సైఫ్ అలీఖాన్, ఆకాశ్ అంబానీ తదితరులు హాజరయ్యారు.

బాలీవుడ్ లవ్‌బర్డ్స్ అలియా భట్-రణ్‌బీర్ కపూర్ పెళ్లి చేసుకున్నారు. ఈ బీ-టౌన్ గ్లామరస్ జోడీ ఏప్రిల్ 14న కొత్త జీవితాన్ని ప్రారంభించింది. రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసమైన ‘వాస్తు’లో వీరి వివాహం కోలాహలంగా ముగిసింది. బాలీవుడ్ హై ప్రొఫైల్ వెడ్డింగ్‌కి నీతూ కపూర్, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, మహేశ్ భట్, సోనీ రజ్దాన్, షాహీన్ భట్, సైఫ్ అలీఖాన్, ఆకాశ్ అంబానీ తదితరులు హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను అలియా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ఐదు ఏళ్ల రిలేషన్ షిప్ అనంతరం ఏప్రిల్ 14న బంధువులు, స్నేహితుల సమక్షంలో మేం పెళ్లి చేసుకున్నాం. జంటగా మరెన్నో అనుభూతులను పంచుకోవడానికి మేం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఈ క్షణం మాకెంతో ప్రత్యేకమైనది’’ అని అలియా భట్ తెలిపింది.
ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రణ్‌బీర్ కపూర్, అలియా భట్లు రిసెప్షన్‌ను ఏప్రిల్ 16న ఏర్పాటు చేశారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ ఫంక్షన్ కి దీపికా పదుకొణె, కత్రినా కైఫ్ తదితరులు హాజరుకాబోతున్నట్టు బీ టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలియా భట్, రణ్‌బీర్ కపూర్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా షూటింగ్ సమయంలో వీరికి ఒకరితో మరొకరికి స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఈ జంట కొన్నేళ్ల నుంచి డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. అనంతరం నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరు ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తున్నారు. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబరు 9న విడుదల కానుంది.