మహిళలను వారి దుస్తుల పొడవును బట్టి అంచనా వేస్తారు : బాలీవుడ్ బ్యూటీ
ABN , First Publish Date - 2022-01-23T14:39:58+05:30 IST
బాలీవుడ్లో సినిమాలు, స్పెషల్ సాంగ్స్‌తో తనకంటూ గుర్తింపు పొందిన నటి మలైకా అరోరా.

బాలీవుడ్లో సినిమాలు, స్పెషల్ సాంగ్స్‌తో తనకంటూ గుర్తింపు పొందిన నటి మలైకా అరోరా. ఈ భామ సినిమాల కంటే తన డ్రెసింగ్తోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తూ విమర్శల పాలవుతూ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన క్రిటీసిజం గురించి మాట్లాడింది ఈ బ్యూటీ.
మలైకా మాట్లాడుతూ.. ‘ఒక స్త్రీని ఎల్లప్పుడూ ఆమె దుస్తుల పొడవును బట్టి అంచనా వేస్తారు. జనాల అభిప్రాయాలకు అనుగుణంగా నా జీవితాన్ని గడపలేను. ఎందుకంటే డ్రెస్సింగ్ అనేది నా వ్యక్తిగత ఎంపిక. మీరు ఒక నిర్దిష్ట విధానంలో ఆలోచించవచ్చు కానీ అది నా కోసం కాకపోవచ్చు. కాబట్టి నేను ఎవరికీ అలాంటి విషయాల గురించి చెప్పను. నాకు నా సొంతంగా ఆలోచనలు, ఎంపికలు ఉంటాయి. అందుకే నేను ఎవరి డ్రెస్సింగ్ గురించి మాట్లాడన’ని తెలిపింది.
మలైకా ఇంకా మాట్లాడుతూ.. ‘ఏది ఏమైనా నేనేం స్టుపిడ్‌ని కాదు. నాకు ఏది బావుంటుందో, ఏది బాగోదో నాకు బాగా తెలుసు. రేపు ఇది బాలేదు అని నాకు అనిపిస్తే నేను అది చేయను. కానీ అప్పుడూ కూడా అది నా ఎంపిక. కాబట్టి దాని గురించి నాకు చెప్పే హక్కు ఎవరికీ లేద’ని చెప్పింది.