Pathaan's controversy: షారుఖ్ ఖాన్ని సజీవ దహనం చేస్తానన్న సాధువు
ABN , First Publish Date - 2022-12-21T14:35:41+05:30 IST
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ సినిమా (Shah Rukh Khan) ‘పఠాన్’పై కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే (Deepika Padukone) హీరోయిన్గా నటిస్తోంది.
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ సినిమా (Shah Rukh Khan) ‘పఠాన్’పై కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే (Deepika Padukone) హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇటీవలే ‘బేషరమ్ రంగ్’ (Besharam Rang) అనే సాంగ్‌ని చిత్రబృందం విడుదల చేసింది. అందులో దీపిక బికినీ కనిపించింది. అలాగే కొన్ని డ్యాన్స్ మూవ్మెంట్స్ అభ్యంతరకరంగా ఉన్నాయి. ఇది నెటిజన్ల కోపానికి కారణమైంది. దీంతో ఈ చిత్రంపై ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. తాజాగా అయోధ్యకి చెందిన ఓ సాధువైతే ఏకంగా షారుఖ్ ఖాన్ కలిస్తే సజీవ దహనం చేస్తానని బెదిరింపులకి దిగారు.
అయోధ్యకి చెందిన తపస్వి ఛావ్నీకి చెందిన మహంత్ పరమహంస (Paramhans Acharya) ఆచార్య ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మన సనాతన ధర్మానికి చెందిన ప్రజలు దీని గురించి నిరంతరం నిరసనలు చేస్తున్నారు. ఈరోజు షారుఖ్ ఖాన్ పోస్టర్‌ను తగులబెట్టాం. నేను జిహాదీ షారుఖ్ ఖాన్‌ను కలిసినట్లయితే, అతనిని సజీవ దహనం చేస్తాను.’ ఆ సాధువు చెప్పుకొచ్చారు. అలాగే ‘బేషరమ్ రంగ్’ సాంగ్‌లో కాషాయ రంగుని అవమానించారని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘పఠాన్’ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే వాటిని తగులబెడతానని ఆచార్య చెప్పుకొచ్చారు. ఇంతకుముందు హనుమాన్ గర్హి పూజారి మహంత్ రాజు దాస్ కూడా సినిమాపై నిరసన వ్యక్తం చేశారు.