Pathaan controversy: షారుఖ్‌ ఖాన్‌కి ‘తెహ్రావీన్’ నిర్వహించిన అయోధ్య సాధువు

ABN , First Publish Date - 2022-12-27T11:36:31+05:30 IST

షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), దీపికా పదుకొనే (Deepika Padukone) చిత్రం ‘పఠాన్‌’ (Pathaan)పై వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు..

Pathaan controversy: షారుఖ్‌ ఖాన్‌కి ‘తెహ్రావీన్’ నిర్వహించిన అయోధ్య సాధువు
Pathaan

షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), దీపికా పదుకొనే (Deepika Padukone) చిత్రం ‘పఠాన్‌’ (Pathaan)పై వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. ఆనంద్ సిద్ధార్థ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని సాగ్ ‘బేషరమ్ రంగ్’ (Besharam Rang)ని ఇటీవలే మూవీ టీం విడుదల చేసింది. అందులో దీపిక వస్త్రధారణ, అందులో కొన్ని మూవ్‌మెంట్స్ వివాదం చేలరేగింది. అలాగే కొందరు సాధువులో ఆ సాంగ్‌లో కాషాయ రంగుని ధరించి హిందు సనాతన ధర్మాన్ని మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు.

ఈ విషయంపై ఇప్పటికే పలువురు అయోధ్య సాధువులు స్పందించి షారుఖ్ మీద విమర్శలు చేశారు. అయోధ్యకి చెందిన తపస్వి ఛావ్నీకి చెందిన మహంత్ పరమహంస్ దాస్ (Mahant Paramhans Das) అయితే.. షారుఖ్ కనిపిస్తే సజీవ దహనం చేస్తానని బెదిరింపులకి దిగారు. ఆయన తాజాగా షారుఖ్‌కి ‘తెహ్రావీన్’ని నిర్వహించారు. అంటే ఉత్తర భారతంలో నిర్వహించే ఓ రకమైన కర్మకాండ.

తాజాగా సాధువు మహంత్ పరమహంస్ దాస్ షారుఖ్ ఫొటో అతికించిన మట్టి కుండని తీసుకుని మద్ధతుదారుల మధ్యలో కూర్చున్నారు. అనంతరం ఆయన కొన్ని మంత్రాలు చదివిన తర్వాత మట్టి కుండను నేలపై పడేసి పగులగొట్టారు. సూపర్‌స్టార్‌ తన సినిమాల ద్వారా ప్రచారం చేస్తున్న ‘జిహాద్‌’కు ‘తెహ్రావీన్‌’ ముగింపు పలుకుతుందని ఆయన అన్నారు. కాగా.. ఇంతకుముందే బీహార్‌లో పఠాన్‌ విడుదలను అడ్డుకుంటామని బీజేపీ నేత హరిభూషణ్‌ ఠాకూర్‌ బచాల్‌ తెలిపారు. అందరికంటే ముందు ఈ పాటపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మొదట అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పాటలోని అనేక సన్నివేశాలను అభ్యంతరకరంగా, అశ్లీలంగా ఉన్నందున వాటిని సినిమాలోంచి తీసేయాలని లేకపోతే మూవీని ఆ రాష్ట్రంలో బ్యాన్ చేస్తామని చెప్పారు.

Updated Date - 2022-12-27T11:38:16+05:30 IST