Year Ender 2022: ఆలియా టు సమంత.. హాలీవుడ్‌లో అడుగుపెట్టిన భారతీయ తారలు వీరే..

ABN , First Publish Date - 2022-12-28T14:50:38+05:30 IST

హాలీవుడ్ (Hollywood).. ఈ చిత్ర పరిశ్రమకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ తెలిసిందే. ఇతర దేశాల నటులు, టెక్నిషియన్స్ అక్కడి సినిమాల్లో పని చేయాలని అనుకుంటారు.

Year Ender 2022: ఆలియా టు సమంత.. హాలీవుడ్‌లో అడుగుపెట్టిన భారతీయ తారలు వీరే..
Hollywood

హాలీవుడ్ (Hollywood).. ఈ చిత్ర పరిశ్రమకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ తెలిసిందే. ఇతర దేశాల నటులు, టెక్నిషియన్స్ అక్కడి సినిమాల్లో పని చేయాలని అనుకుంటారు. దానికి మన భారత సినీ పరిశ్రమ ప్రముఖులు ఏం మినహాయింపు కాదు. ఇప్పటికే ఐశ్వర్యారాయ్, దీపిక పదుకొనే వంటి తారలు అక్కడి సినిమాల్లో మెరిశారు. ప్రియాంక చోప్రా అయితే అక్కడే సెటిల్ అయిపోయింది కూడా. ఈ తరుణంలో 2022 కొందరు టాప్ హీరోయిన్లు హాలీవుడ్ చిత్రాల్లో అవకాశం దక్కించుకున్నారు. వారి వివరాలు తెలుసుకుందాం..

ఆలియా భట్ (Alia Bhatt)

ఈ ఏడాది ఆలియా భట్‌కి చాలా కలిసొచ్చిందని చెప్పాలి. రణ్‌బీర్‌ కపూర్‌తో పెళ్లి జరిగింది. అనంతరం ఓ పండంటి పాపకి జన్మనిచ్చింది. అలాగే ‘గంగుభాయి కతియవాడి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘బ్రహ్మాస్త్ర’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే ఓ హాలీవుడ్ మూవీలో ఈ బ్యూటీ అవకాశం దక్కించుకుంది. ‘వండర్ ఉమెన్’ ఫేమ్ గాల్ గాడెట్‌తో కలిసి ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

alia-bhatt.jpg

సమంత (Samantha)

ఈ ఏడాది సమంతకి కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా గడిచింది. ఆమె నటించిన ‘యశోద’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. అదే సమయంలో మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. కాగా.. ఈ బ్యూటీ సైతం రెండు హాలీవుడ్ చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది. బాఫ్టా అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్స్ దర్శకత్వంలో ‘ఆరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే చిత్రంతోపాటు.. రుస్సో బ్రదర్స్ దర్శకత్వంలో ప్రియాక చోప్రాతో కలిసి ఓ సినిమా చేయబోతోంది.

samantha.jpg

జాక్వెలిన్ ఫెర్నాడెజ్ (Jacqueline Fernandez)

బాలీవుడ్‌లోని పాపులర్ హీరోయిన్లలో జాక్వెలిన్ ఫెర్నాడెజ్. ఈ బ్యూటీ ఓ ఆంథాలజీ సిరీస్ ద్వారా హాలీవుడ్‌‌కి పరిచయం కానుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది మహిళా దర్శకులు దర్శకత్వం వహించనున్న ‘టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్’ అనేది ఆ చిత్రం. ఈ ఆంథాలజీలో జెన్నిఫర్ హడ్సన్, తారాజీ పి హెన్సన్, కారా డెలివింగ్నే నటించనున్నారు.

jaqual.jpg

శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala)

యాక్షన్ థ్రిల్లర్ ‘మంకీ మ్యాన్‌’తో శోభితా ధూళిపాళ హాలీవుడ్‌లోకి ప్రవేశిస్తోంది. ఈ చిత్రం ద్వారా నటుడు దేవ్ పటేల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కొందరు చేసిన మోసం వల్ల జైలుకి వెళ్లిన యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ మూవీలో దక్షిణాఫ్రికా నటుడు షార్ల్టో కోప్లీ కూడా ఓ ముఖ్య పాత్రలో నటించనున్నాడు.

shobhitha.jpg

Updated Date - 2022-12-28T15:16:32+05:30 IST