alia bhatt: నా జీవిత కథ నేనే రాసుకొంటా!
ABN , First Publish Date - 2022-12-18T08:04:50+05:30 IST
ఈ దశాబ్దపు అత్యంత ప్రతిభావంతమైన కథానాయికల్లో అలియా భట్ పేరు కూడా ఉంటుంది. సినిమా సినిమాకీ తనలోని నటిని మెరుగుపరచుకొంటూ, వ్యక్తిగానూ ఎదుగుతోంది. ఇప్పుడు భార్యగా, ఇల్లాలిగా, తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తోంది.
ఈ దశాబ్దపు అత్యంత ప్రతిభావంతమైన కథానాయికల్లో అలియా భట్ (alia bhatt)పేరు కూడా ఉంటుంది. సినిమా సినిమాకీ తనలోని నటిని మెరుగుపరచుకొంటూ, వ్యక్తిగానూ (Persanal life)ఎదుగుతోంది. ఇప్పుడు భార్యగా, ఇల్లాలిగా, తల్లిగా (motherhood) బాధ్యతలు నెరవేరుస్తోంది. 2022 టాప్ సెలబ్రిటీల జాబితాలో అలియాకు (Alia Philosophy)చోటు దక్కింది. ఈ సందర్భంగా అలియా ఇష్టాయిష్టాలూ, జీవితంపై తన ఫిలాసఫీ తెలుసుకొంటే...
నిద్రంటే బంగారం
అలియా ఇప్పుడంటే రోజుకి 18 గంటలు పని చేస్తోంది కానీ, ఇది వరకు ఒట్టి నిద్రపోతు. రోజంతా నిద్రపొమ్మన్నా.. ‘సరే’ అనేదట. అంతెందుకు చిన్నప్పుడు క్లాస్ రూమ్‌లో, బెంచీ మీద ఆదమరచి నిద్రపోయేదట. టీచర్లు చూసి, మందలిస్తే ఆ తరవాత బాత్‌రూమ్ పేరు చెప్పి, అక్కడ కునుకు తీసేదట. ఆదివారం వస్తే మంచమే దిగేది కాదట.
డ్యాన్స్ ఫేవరేట్స్
చిత్రసీమలో చాలామంది బెస్ట్ డ్యాన్సర్లు ఉన్నారు. అయితే రణబీర్ కపూర్ డ్యాన్సంటే అలియాకు చాలా ఇష్టమట. ‘ఇండస్ర్టీలో అత్యుత్తమ డ్యాన్సర్ రణబీర్’ అని ఓ సందర్భంలో చెప్పింది అలియా. అసలేమాత్రం శ్రమ పడకుండా స్టెప్పులేస్తాడని, తనతో డ్యాన్స్ చేయడం ఎవరికైనా సవాలే అని చెప్పుకొచ్చింది. కథానాయికల్లో మాధురీ దీక్షిత్ లాంటి డ్యాన్సర్‌ని చూడలేదని, ఇక ముందు కూడా అలాంటి డ్యాన్సర్ పుట్టదని చెబుతుంది.
సమయపాలన ముఖ్యం
టైమ్‌కి అలియా చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. అలియా సెట్‌కి ఆలస్యంగా రావడం తాము చూడనే లేదని ఆమెతో పనిచేసిన నిర్మాతలు, దర్శకులు చెబుతుంటారు. ‘టైమ్ ఈజ్ మనీ.. సినిమాల్లోకి వచ్చాక నేర్చుకొన్న తొలి పాఠం ఇదే.. సెట్‌కి నేను ఆలస్యంగా వెళ్తే.. నా వల్ల షూటింగ్ లేట్ అయితే.. ఎంత నష్టం వస్తుందో నాకు తెలుసు. అందుకే ఆ పొరపాటు ఎప్పుడూ చేయను’ అంటోంది. ఆమెకు డైరీ రాసే అలవాటు ఉంది. ఎప్పటికైనా తన కథని తానే రాసుకుంటానంటోంది అలియా.
‘బడ్డీ’ ఫుడీ...
స్ర్టీట్ ఫుడ్ అంటే అలియాకు చాలా ఇష్టం. అందులోనూ గ్రిల్ ఫిష్ అంటే మరీనూ. రసగుల్లా తన ఆల్ టైమ్ ఫేవరెట్. కార్లో ఎప్పుడైనా దూర ప్రయాణం చేస్తూ, మధ్య మధ్యలో ఆగుతూ.. అక్కడ చిన్న బడ్డీల్లో దొరికే తిను బండారాల్ని ఇష్టంగా తింటుంది.
మూడాఫ్ అయితే...
అలియా తీరిగ్గా కూర్చుని తన పాత ఫొటోలన్నీ ఓసారి తిరగేస్తోందంటే.. తన మూడ్ బాగోలేదని అర్థం చేసుకోవాలి. మానసిక ఒత్తిడికి గురైనప్పుడల్లా తన ఫోన్‌లో ఉన్న పాత ఫొటోల్ని ఒక్కసారి రివైండ్ చేసుకొంటుందట. అలా చేస్తే తన గత జ్ఞాపకాలు, తాను సాధించిన విజయాలు, నచ్చిన వ్యక్తులు కళ్లముందు కదలాడినప్పుడు.. మళ్లీ తన పెదాలపై చిరునవ్వు ఆటోమెటిగ్గా వచ్చేస్తుందట. ఈ సీక్రెట్ తన స్నేహితులందరికీ తెలుసు.
పాటలంటే ఇష్టం
అలియాకు పాటలు వినడం అంటే చాలా ఇష్టం. ‘లగ్ జా గలే’ తన ఆల్‌టైమ్ ఫేవరెట్. ‘కబీర్‌సింగ్’లోని ‘తుఝే కిత్‌నా చహనే లగే’ పాటని లెక్కలేనన్నిసార్లు విన్నదట. కథానాయికల్లో పరిణితీ చోప్రా బాగా పాటలు పాడుతుందని, తనని ఓ మంచి సింగర్‌గా చూడాలని ఉందని చెప్పుకొచ్చింది అలియా.
ప్రభాస్ అభిమాని
తెలుగులో ఎన్టీఆర్ సరసన నటించింది అలియా. అయితే టాలీవుడ్‌లో తన ఫేవరెట్ స్టార్ పేరు చెప్పమంటే ఏమాత్రం ఆలోచించకుండా ప్రభాస్ అంటోంది. ‘బాహుబలి’లో ప్రభాస్ నటన, ఆ సినిమా కోసం తను పడిన కష్టం అలియాకు బాగా నచ్చాయట. ప్రభాస్ రాకతో మిగిలిన హీరోల్లో అటెన్షన్ పెరిగిందంటోంది అలియా.
కార్లపై మోజు
సాధారణంగా అమ్మాయిలకు నగలు, చీరలంటే ఇష్టం. కానీ అలియాకు కార్లంటే మోజు. కొత్త మోడల్ కారు వచ్చిందటే, అది తనకు నచ్చితే ఎంత ఖరీదైనా కొనేస్తుందట. అలియా దగ్గర దాదాపు 10 ఖరీదైన కార్లున్నాయి. అవన్నీ తన సొంత డబ్బులతో కొనుక్కొన్నవే. అలియాకు దూర ప్రయాణాలు చేయడం సరదా. కార్లో ఒంటరిగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించడం చేస్తుంటుంది.