మూడోసారి.. విజయ్ సేతుపతి వర్సెస్ శివ కార్తికేయన్

ABN , First Publish Date - 2021-12-12T00:50:47+05:30 IST

కోలీవుడ్‌ హీరోలు విజయ్‌ సేతుపతి (వీఎస్‌), శివకార్తికేయన్‌ (ఎస్‌కే)లు ముచ్చటగా మూడోసారి వెండితెరపై తలపడనున్నారు. వీరిద్దరు నటించిన సినిమాలు ఒకే తేదీన విడుదలకానున్నాయి. గతంలో రెండు సార్లు వీరిద్దరు నటించిన చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. ఇపుడు మరోమారు

మూడోసారి.. విజయ్ సేతుపతి వర్సెస్ శివ కార్తికేయన్

కోలీవుడ్‌ హీరోలు విజయ్‌ సేతుపతి (వీఎస్‌), శివకార్తికేయన్‌ (ఎస్‌కే)లు ముచ్చటగా మూడోసారి వెండితెరపై తలపడనున్నారు. వీరిద్దరు నటించిన సినిమాలు ఒకే తేదీన విడుదలకానున్నాయి. గతంలో రెండు సార్లు వీరిద్దరు నటించిన చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. ఇపుడు మరోమారు ఇది రిపీట్‌కానుంది. ఇటీవల ‘డాక్టర్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివకార్తికేయన్‌ తాజా చిత్రం ‘డాన్‌’. సిబి చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతోంది. ప్రియాంకా అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 17 ఎస్‌కే పుట్టిన రోజు. మరుసటి రోజు ఫిబ్రవరి 18న ‘డాన్‌’ మూవీని విడుదల చేయాలని భావిస్తున్నారు. 


అదేవిధంగా ‘మక్కల్‌ సెల్వన్‌’ విజయ్‌ సేతుపతి హీరోగా విఘ్నేష్‌ శివన్‌ తెరకెక్కించిన ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ చిత్రాన్ని కూడా ఫిబ్రవరి 18నే రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. ఇదే నిజమైతే ఎస్‌కే, వీఎస్‌ మరోమారు వెండితెరపై తలపడనున్నారు. 2013లో వీరిద్దరు నటించిన ‘ఎదిర్‌నీచ్చల్‌’, ‘సూదుకవ్వుం’, 2016లో ‘రెమో’, ‘రెక్కై’ చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. కాగా ‘డాన్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకున్నట్టు చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. 

Updated Date - 2021-12-12T00:50:47+05:30 IST