‘సర్పట్టా’లోని ఆ పాత్రపై ప్రశంసల వర్షం
ABN , First Publish Date - 2021-08-01T02:14:26+05:30 IST
అందుకే దర్శకుడు రంజిత్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా నా మిత్రుడు ఆర్యతో కలిసి స్ర్కీన్‌ను షేర్ చేసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఈ చిత్రంలో నాతో కలిసి నటించిన ప్రతి ఒక్క కళాకారుడుకి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే, ఈ చిత్ర నిర్మాణంలో

దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సర్పట్టా పరంబరై’. 1970 దశకంలో ఉత్తర చెన్నైలో ఉన్న బాక్సింగ్ క్రీడాకారుల జీవితాన్ని ఇతి వృత్తంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ‘రంగన్ వాత్తియార్’గా సీనియర్ నటుడు పశుపతి నటించారు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరు తమతమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఫలితంగానే ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఓటీటీలో విడుదలైనప్పటికీ కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే, రంగన్న పాత్ర పోషించినందుకు తనకు వస్తున్న ప్రశంసలు, అభినందనలపై నటుడు పశుపతి స్పందించారు. ఇదే విషయంపై ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘ఈ చిత్ర కథను ఎంచుకున్న విధానం, పాత్రలను మలిచేందుకు దర్శకుడు పా.రంజిత్ ఒక ఇంద్రజాలకుడిగా మారిపోయారు. ఉత్తర చెన్నైలోని బాక్సర్ల నిజమైన జీవితాన్ని కథాంశంగా ఎన్నుకుని దాన్ని తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా నన్ను రంగన్ వాత్తియార్‌గా మలిచిన తీరును మాటల్లో వర్ణించలేను. అందుకే దర్శకుడు రంజిత్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా నా మిత్రుడు ఆర్యతో కలిసి స్ర్కీన్‌ను షేర్ చేసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఈ చిత్రంలో నాతో కలిసి నటించిన ప్రతి ఒక్క కళాకారుడుకి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే, ఈ చిత్ర నిర్మాణంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన నీలం ప్రొడక్షన్, కే9 స్టూడియో నిర్మాణ సంస్థలకు కృతఙ్ఞతలు. అలాగే, 22 యేళ్ళ సినీ జీవితంలో నాతో కలిసి ప్రయాణం చేసిన దర్శకనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియా మిత్రులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా సినీ అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు’’ అని పశుపతి తన ప్రకటనలో పేర్కొన్నారు.