సముద్రగర్భంలో అరుణ్ విజయ్ ‘యానై’ పోస్టర్ ఆవిష్కరణ
ABN , First Publish Date - 2021-09-19T22:53:39+05:30 IST
కోలీవుడ్ యంగ్ హీరో అరుణ్ విజయ్, మాస్ డైరెక్టర్ హరి కాంబినేషన్లో తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో రూపుదిద్దుకుంటున్న మూవీ ‘యానై’ .

కోలీవుడ్ యంగ్ హీరో అరుణ్ విజయ్, మాస్ డైరెక్టర్ హరి కాంబినేషన్లో తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో రూపుదిద్దుకుంటున్న మూవీ ‘యానై’ . ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. అయితే, ఈ చిత్రం పోస్టర్ ఆవిష్కరణను అరుణ్ విజయ్ ఫ్యాన్స్ విభిన్నంగా నిర్వహించారు. శనివారం పుదుచ్చేరికి చెందిన అరుణ్ విజయ్ ఫ్యాన్స్ ‘యానై’ పోస్టర్‌ను సముద్రగర్భంలో ఆవిష్కరించారు. ఈ తరహాలో పోస్టర్‌ను ఆవిష్కరించడం ఇదే తొలిసారని కోలీవుడ్ వర్గాల సమాచారం. కాగా ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రియా భవానీశంకర్ నటిస్తుండగా, సీనియర్ నటీనటులు సముద్రఖని, రాధిక, యోగిబాబు తదితరులు కూడా నటిస్తున్నారు. ఇదే సినిమా తెలుగులో ‘ఏనుగు’ గా విడుదల కాబోతోంది.