‘వలిమై’ యాక్షన్‌ స్టంట్స్‌ ఫొటోస్‌ లీక్‌

ABN , First Publish Date - 2021-11-11T23:57:27+05:30 IST

అగ్రహీరో అజిత్‌ - హెచ్‌.వినోద్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘వలిమై’ చిత్ర యాక్షన్‌ స్టంట్స్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూస్తే ఈ యాక్షన్‌ స్టంట్స్‌ను రష్యాలో

‘వలిమై’ యాక్షన్‌ స్టంట్స్‌ ఫొటోస్‌ లీక్‌

అగ్రహీరో అజిత్‌ - హెచ్‌.వినోద్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘వలిమై’ చిత్ర యాక్షన్‌ స్టంట్స్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూస్తే ఈ యాక్షన్‌ స్టంట్స్‌ను రష్యాలో చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి అజిత్‌ ఒక ఇంటర్నేషనల్‌ బైక్‌ రేసర్‌ అనే విషయం తెలిసిందే. గతంలో ఆయన నటించిన అనేక చిత్రాల్లో ఎలాంటి డూప్‌ లేకుండా నటించారు. పలు సందర్భాల్లో ఆయనకు దెబ్బలు కూడా తగిలాయి. 


ఇప్పుడు ఇదే తరహాలోనే ఆయన యాక్షన్‌ స్టంట్స్‌లో ‘వలిమై’ కోసం చేస్తున్నట్టు తెలుస్తుంది. కాగా, ఇందులో అజిత్‌ సరసన బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ నటిస్తుండగా, విలన్‌ పాత్రలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ నటిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ భారీ బడ్జెట్‌తో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు.

Updated Date - 2021-11-11T23:57:27+05:30 IST