'రాజ రాజ చోర': ఓటీటీలో వచ్చేసింది..
ABN , First Publish Date - 2021-10-08T18:10:00+05:30 IST
టాలెంటడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ "రాజ రాజ చోర". ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కరోనా వేవ్స్ కారణంగా థియేటర్స్ మూతపడినా కూడా ప్రేక్షకులు ఓటీటీలలో సినిమాలు చూసేందుకు బాగా ఆసక్తి చూపించారు.

టాలెంటడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ "రాజ రాజ చోర". ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కరోనా వేవ్స్ కారణంగా థియేటర్స్ మూతపడినా కూడా ప్రేక్షకులు ఓటీటీలలో సినిమాలు చూసేందుకు బాగా ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలోనే తెలుగు, తమిళ, హిందీ సహా పలు భాషల చిత్రాలు ప్రముఖ ఓటీటీలలో రిలీజై ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీలో రిలీజైన కొన్ని సినిమాలు మళ్ళీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంటే..థియేటర్స్లో విడుదలైన సినిమాలు కొన్ని హిట్ టాక్తో వచ్చిన క్రేజ్ కారణంగా తిరిగి ఓటీటీలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్స్లో విడుదలై మంచి లాభాలు తెచ్చిపెట్టిన "రాజ రాజ చోర" కూడా స్ట్రీమింగ్ యాప్ జీ 5 లో ఈరోజు (అక్టోబర్ 8 )నుంచి స్ట్రీమింగ్ అవుతోమిద్. ఈ మూవీకి హసిత్ గోలి దర్శకుడు. మేఘా ఆకాష్ ఇందులో హీరోయిన్గా నటించింది.