వినాయకచవితికి ‘జీ5’లో ‘డిక్కిలోనా’
ABN , First Publish Date - 2021-08-21T02:43:40+05:30 IST
ప్రముఖ హాస్య నటుడు సంతానం హీరోగా నటించిన చిత్రం ‘డిక్కిలోనా’. కార్తీక్ యోగి దర్శకుడుగా పరిచయమవున్నారు. ఈ చిత్రాన్ని కేజేఆర్ స్టూడియో, సోల్జర్స్ ఫ్యాక్టరీ సంస్థలు కలిసి నిర్మించాయి. గతంలో

ప్రముఖ హాస్య నటుడు సంతానం హీరోగా నటించిన చిత్రం ‘డిక్కిలోనా’. కార్తీక్ యోగి దర్శకుడుగా పరిచయమవున్నారు. ఈ చిత్రాన్ని కేజేఆర్ స్టూడియో, సోల్జర్స్ ఫ్యాక్టరీ సంస్థలు కలిసి నిర్మించాయి. గతంలో ‘లాకప్’, ‘క.పె.రణసింగం’, ‘ముకిలన్’, ‘మదిల్’ వంటి చిత్రాలను ప్రసారం చేసిన జీ5 ప్రైమ్ ఈ చిత్రాన్ని కూడా ప్రసారం చేయనుంది. దీనిని ఒక ట్రావెల్ ఫాంటసీ డ్రామా మూవీగా రూపొందించారు. ఇందులో సంతానంతో పాటు యోగిబాబు, అనకా, షిరీన్, మొట్టై రాజేంద్రన్, ఆనంద్రాజ్, మునీష్కాంత్, చిత్రా లక్ష్మణన్ తదితరులు నటించారు.
అరవింద్ ఛాయగ్రహకుడుగా పనిచేయగా, జోమిన్ మాథ్యూ ఎడిటింగ్ పనులు పూర్తి చేశారు. సంగీతం యువన్ శంకర్ రాజా. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ను రిలీజ్ చేయగా, అది మంచి ఆదరణ పొందింది. ‘మైఖేల్ మదన్ కామరాజ్’ చిత్రంలో ‘ఇసైఙ్ఙాని’ ఇళయరాజా స్వరపరిచిన ‘పేర్ వెచ్చా’ అనే పాటను ఈ చిత్రంలో రీమిక్స్ చేశారు. ఈ పాటను కూడా ఇప్పటివరకు ఆరు మిలియన్ల మంది నెటిజన్లు వీక్షించారు. ముఖ్యంగా భారత మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10వ తేదీన వినాయకచవితి పండుగను పురస్కరించుకుని జీ5 ఒరిజినల్లో విడుదల చేయనున్నారు.