‘ఆహా’లో.. అమలాపాల్ ‘కుడి ఎడమైతే’!
ABN , First Publish Date - 2021-06-27T00:08:19+05:30 IST
అమలాపాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న వెబ్ సిరీస్ 'కుడి ఎడమైతే'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సిరీస్ త్వరలో తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో ప్రసారం కానుంది. ఇండియాలో డిజిటల్

అమలాపాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న వెబ్ సిరీస్ 'కుడి ఎడమైతే'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సిరీస్ త్వరలో తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో ప్రసారం కానుంది. ఇండియాలో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసారమవుతున్న తొలి సైంటిఫికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. రామ్ విఘ్నేశ్ క్రియేట్ చేసిన ఈ సిరీస్‌ను లూసియా, యూ టర్న్ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు పవన్ కుమార్ తెరకెక్కించారు. ఈ సిరీస్ మోషన్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు.
గోడపై అతికించిన నోటీసులు, గన్, గడియారం వంటి విజువల్స్‌తో ఉన్న ఈ మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఇందులో అమలాపాల్, విజ్ఞత లేని క్రూరమైన పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుంటే.. రాహుల్ విజయ్ డెలివరీ బాయ్ పాత్రలో కనిపించారు. భిన్నమైన రంగాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను జీవితం ఎలా కలిపింది? సైంటిఫిక్ అంశాలు ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో ఎలా వచ్చాయి? అనేది తెలుసుకోవాలంటే త్వరలోనే ‘ఆహా’లో ప్రసారం కాబోయే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.