Rare Pic: దాసరితో కైకాల సత్యనారాయణ సోదరులు
ABN , First Publish Date - 2021-07-11T22:19:25+05:30 IST
ఏ పాత్ర ఇచ్చినా దానికి పూర్తి న్యాయం చేయగల అద్భుత నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు. ఆయన పేరు చెప్పగానే కొన్ని వందల పాత్రలు అలా కళ్ల ముందు కనిపిస్తాయి. కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్‌కు డూప్‌గా కొన్ని చిత్రాల్లో

ఏ పాత్ర ఇచ్చినా దానికి పూర్తి న్యాయం చేయగల అద్భుత నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు. ఆయన పేరు చెప్పగానే కొన్ని వందల పాత్రలు అలా కళ్ల ముందు కనిపిస్తాయి. కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్‌కు డూప్‌గా కొన్ని చిత్రాల్లో నటించిన సత్యనారాయణ, ఆ తర్వాత ఆయనకు సన్నిహితుడై 102 చిత్రాల్లో కలిసి నటించి, ఓ రికార్డు నెలకొల్పారు. తెరమీద హీరోగా ఎన్టీఆర్, విలన్‌గా సత్యనారాయణ కనిపించి పోటాపోటీగా నటిస్తుంటే, ఆడియన్స్ ఆనందంతో ఈలలు వేసేవారు.
సత్యనారాయణ మంచి నటుడే కాదు, అభిరుచి కలిగిన నిర్మాత కూడా. తన సోదరుడు కైకాల నాగేశ్వరరావుతో కలసి ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్రహీరోలతో చిత్రాలు నిర్మించారు. వాటిలో ‘బంగారు కుటుంబం’ ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ జంటగా నటించిన ఈ చిత్రానికి దాసరి దర్శకుడు. అంతే కాదు ఈ చిత్రంలో మొదలియార్ అనే ఓ విభిన్న పాత్ర కూడా పోషించారు దాసరి. ఈ సినిమాలో విలన్ పాత్ర సత్యనారాయణది. ఈ చిత్రం షూటింగ్ స్పాట్లో దాసరితో సత్యనారాయణ సోదరులు ఉన్న దృశ్యమిది.
-వినాయకరావు