తనని ‘గుంగీ గుడియా’ అని ఎందుకనేవారో జయప్రద మాటల్లో..
ABN , First Publish Date - 2021-05-05T05:50:03+05:30 IST
ఆ గుంగీ గుడియా ఇప్పుడు పాలిటిక్స్‌లోకి వచ్చిన తర్వాత రెండు గంటలు అనర్గళంగా హిందీలో మాట్లాడుతోంది. అది కూడా యుపీ లాంగ్వేజ్‌లో. యుపీ హిందీ చాలా టఫ్‌గా ఉంటుంది. యూపీ లాంగ్వేజ్‌లో ఉర్దూ మాట్లాడాలి. షాయరీ పలకాలి. అవధీ మాట్లాడాలి. హిందీ ఆడియన్స్ వల్లనే నేను

జయప్రద.. సినీ ఇండస్ట్రీకి పరిచయం అక్కరలేని పేరు. హీరోయిన్గా చేసే రోజుల్లో ఆమె ఫాలోయింగ్ మాములుగా ఉండేది కాదు. తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించిన జయప్రద.. హిందీ ఫీల్డ్‌కు వెళ్లి అక్కడ కూడా అగ్రకథానాయికగా వెలిగారు. తాజాగా తనని బాలీవుడ్లో మొదట్లో ‘గుంగీ గుడియా’ అని పిలిచేవారని, అలా ఎందుకు పిలిచేవారో.. అలా పిలవడానికి కారణ ఏమిటో స్వయంగా జయప్రదే చెప్పుకొచ్చింది.
‘‘సిరిసిరిమువ్వ చేసినప్పుడు డైలాగులు చెబితేనే ఎక్స్ప్రెషన్స్ ఆడియన్స్‌కి అర్థమవుతాయా? లేవా? అనే పరిస్థితుల్లో ఉండేదాన్ని. అలాంటిది ఎలాంటి మాటలూ లేకుండా జనాలకు అర్థం అయ్యేలా నటించాల్సి వచ్చింది. అప్పుడు నా వ్యవహారిక శైలి మరింత మెరుగుపడింది. ఆ తర్వాత ‘సర్గమ్’ అప్పుడు హిందీవారు ‘గుంగీ గుడియా’ అనేవారు. మాటలు రావు కాబట్టి కేరక్టర్‌ని అలా చేశారని అనుకునేవారు. ఆ గుంగీ గుడియా ఇప్పుడు పాలిటిక్స్‌లోకి వచ్చిన తర్వాత రెండు గంటలు అనర్గళంగా హిందీలో మాట్లాడుతోంది. అది కూడా యుపీ లాంగ్వేజ్‌లో. యుపీ హిందీ చాలా టఫ్‌గా ఉంటుంది. యూపీ లాంగ్వేజ్‌లో ఉర్దూ మాట్లాడాలి. షాయరీ పలకాలి. అవధీ మాట్లాడాలి. హిందీ ఆడియన్స్ వల్లనే నేను హిందీ నేర్చుకున్నా. అది లేకపోతే నాకు హిందీ వచ్చేది కాదేమో. బాలీవుడ్‌కి వెళ్లడం వల్ల నాకు హిందీ ఇన్ఫ్లుయన్స్ బాగా ఉంది. డైలాగుల వరకు బాగానే చెప్పేదాన్ని. నా డబ్బింగ్ కూడా నేనే చెప్పేదాన్ని. అది కూడా పట్టుదల మీదనే చేసేదాన్ని. అప్పుడు నార్త్, సౌత్ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉండేది. ‘అరే తను సౌత్ గర్ల్. హిందీ రాదు’ అనేవారు. ‘గుంగీ గుడియా’ అనేవారు కదా. దాన్ని నేను చాలెంజ్‌గా తీసుకున్నా. తెల్లారుజామున ఐదు గంటలకు ఉర్దూ టీచర్ వచ్చేవాడు. ఆయన్ని నాతో పాటు లొకేషన్‌కి తీసుకెళ్లేదాన్ని. నేను ఎన్ని బూతులు మాట్లాడినా ఆయన టాలరేట్ చేసేవారు. అది నాకు చాలా హెల్ప్ అయింది. ప్రొనౌన్సియేషన్, డిక్షన్ చాలా ఉపయోగపడింది. యుపీ అనగానే చాలా కన్జర్వేటివ్. గుంగట్ వేసుకుని తిరగాలి. హిందీ తప్ప మిగిలిన భాషలు వాళ్లకు అర్థం కావు. ముంబై హిందీ సంపూర్ణంగా వేరుగా ఉండేది, యుపీలో పూర్తిగా వేరు. కల్చర్ వేరు. ఏ డ్రస్ వేసుకున్నా గ్లామర్‌గా కనిపించే రంగం నుంచి వచ్చిన నేను గుంగట్ వేసుకుని తిరిగేదాన్ని. షాయరీ నేర్చుకునేదాన్ని. డిక్షన్ బాగా రాకపోతే అక్కడి వాళ్లు నవ్వేవాళ్లు. అందుకే నేను కచ్చితంగా బాగా నేర్చుకుని వెళ్లేదాన్ని..’’ అని జయప్రద తెలిపింది.
-వినాయకరావు
