రేర్ పిక్: ‘గోవిందా గోవింద’ సెట్లో ఆ నలుగురు
ABN , First Publish Date - 2021-08-04T01:20:55+05:30 IST
కొన్ని సినిమాలు నిర్మాణంలో ఉండగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతుంటాయి. అవి ఎప్పుడు విడుదల అవుతాయా, ఎంత తొందరగా చూసేద్దామా అనే కుతూహలం వాళ్ళలో ఉంటుంది. అలా నిర్మాణంలో ఉండగానే అందరి దృష్టినీ

కొన్ని సినిమాలు నిర్మాణంలో ఉండగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతుంటాయి. అవి ఎప్పుడు విడుదల అవుతాయా, ఎంత తొందరగా చూసేద్దామా అనే కుతూహలం వాళ్ళలో ఉంటుంది. అలా నిర్మాణంలో ఉండగానే అందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రం ‘గోవిందా గోవింద’. కొత్తదనం కోసం కృషి చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు కావడం దీనికి ప్రధాన కారణం. అలాగే ‘గోవిందా గోవింద’ చిత్రానికి వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ నిర్మాత కావడం కూడా ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉండడానికి మరో కారణం. వీరిద్దరికీ తోడుగా కింగ్ నాగార్జున, గ్లామర్ క్వీన్ శ్రీదేవి జంటగా కలిశారు.
‘ఆఖరి పోరాటం’ చిత్రం తర్వాత నాగార్జున, శ్రీదేవి జంటగా నటించిన సినిమా ఇదే. ఈ నలుగురు ‘గోవిందా గోవింద’ చిత్రానికి కలవడంతో ప్రేక్షకుల అంచనాలకు పట్ట పగ్గాలు లేవు. దానికి తోడు ఆ రోజుల్లో మీడియా కూడా ఇది సాదా సీదా సినిమా కాదని ప్రచారం చేయడంతో ‘గోవిందా గోవింద’ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే సినిమా చూసి చాలా మంది ప్రేక్షకులు పెదవి విరిచారు. మ్యూజికల్‌గా మాత్రం చిత్రం హిట్. సినిమాలోని అన్ని పాటలూ అలరించాయి. సంగీత దర్శకత్వ ద్వయం రాజ్–కోటి కొత్తరకం బాణీలతో సంగీత ప్రియులకు మరింత దగ్గరయ్యారు.
-వినాయకరావు
