రేర్ పిక్: లొకేషన్లో చిరు, దాసరి
ABN , First Publish Date - 2021-07-06T02:48:25+05:30 IST
శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన డాక్టర్ దాసరి నారాయణరావు, మెగాస్థార్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ఏకైక సినిమా ‘లంకేశ్వరుడు’. ఇది దాసరికి నూరో చిత్రం కావడం గమనార్హం. అంతకుముందు

శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన డాక్టర్ దాసరి నారాయణరావు, మెగాస్థార్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ఏకైక సినిమా ‘లంకేశ్వరుడు’. ఇది దాసరికి నూరో చిత్రం కావడం గమనార్హం. అంతకుముందు ఎంతోమంది నిర్మాతలు ఈ కాంబినేషన్లో సినిమా తీయాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. నిర్మాత వడ్డే రమేశ్కే ఆ అవకాశం దక్కింది. చిరంజీవి సినిమా అనగానే డాన్సులు, ఫైట్లు ఆశిస్తారు ప్రేక్షకులు. ‘లంకేశ్వరుడు’ చిత్రంలో ఆ రెండింటితో పాటు ఓ కొత్త చిరంజీవిని ఇందులో చూడవచ్చు. చెల్లెలి ప్రేమ కోసం తపించే అన్నయ్యగా ఆయన ఇందులో కనిపిస్తారు. డైలాగులకు దాసరి పెట్టింది పేరు. ఆ డైలాగుల్ని చిరంజీవి నోట వినడం అభిమానులకు కొత్త అనుభూతి కలిగించింది. ఈ చిత్రానికి రాజ్-కోటి సంగీత దర్శకత్వం వహించారు. పాటల రికార్డింగ్ సందర్బంగా వారిద్దరితో చర్చిస్తున్న దాసరి, చిరంజీవిలను ఇందులో చూడవచ్చు
-వినాయకరావు