CVL Narasimharao: నామినేషన్ ఉపసంహరించుకున్నా
ABN , First Publish Date - 2021-10-02T19:36:58+05:30 IST
ఇటీవల ‘మా’ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసి, శనివారం తన మ్యానిఫెస్టోను ప్రకటించిన సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు కొద్ది సేపటి క్రితం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే దీనికి కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఆయన మాట్లాడుతూ ‘‘మా’ అధ్యక్ష పదవికి నామినేషన్ వేశాను. ఇప్పుడు ఉప సంహరించుకున్నాను. అందుకు ప్రత్యేక కారణం ఉంది.

కారణం రెండ్రోజుల్లో చెబుతా..
ఆ ఇద్దరికీ నా మద్దతు లేదు..
పదవి కన్నా ‘మా’ సంక్షేమమే ముఖ్యం
ఇటీవల ‘మా’ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసి, శనివారం తన మ్యానిఫెస్టోను ప్రకటించిన సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు కొద్ది సేపటి క్రితం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే దీనికి కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఆయన మాట్లాడుతూ ‘‘మా’ అధ్యక్ష పదవికి నామినేషన్ వేశాను. ఇప్పుడు ఉప సంహరించుకున్నాను. అందుకు ప్రత్యేక కారణం ఉంది. అన్ని వివరాలు రెండు రోజుల్లో మీడియా ముందు ఉంచుతాను. అధ్యక్ష పదవికంటే నాకు ‘మా’ సభ్యుల సంక్షేమం ముఖ్యం. ప్రస్తుతం పోటీలో ఉన్న రెండు ప్యానళ్లకు నేను మద్దతు ఇవ్వడం లేదు. ట్విట్టర్ వేదికగా సపోర్ట్ చేసిన విజయశాంతికి ధన్యవాదాలు. మా ఎన్నికల్లో ఎవరు గెలిచిన మా సంక్షేమం కోసం పని చెయ్యాలి’’ అని ఆయన పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ వేసిన బండ్ల గణేష్ కూడా తన నామినేషన్ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే!
సీవీఎల్ ప్రకటించిన మ్యానిఫెస్టో ఇదే:
1. 2011లో ఒక టీమ్‌తో కలిసి తయారు చేసిన మ్యానిఫెస్టోను ఇప్పుడు అమలు చేస్తాం. ఆ నిర్ణయాలను అమలు చేయడానికి 50 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు. ఆ పేర్లను త్వరలో ప్రకటిస్తా. ప్రతి ఒక్కరికీ అవకాశాల వచ్చేలా చూస్తాం.
2. ‘మా’ అసోసియేషన్లోనిప్రతి సభ్యుడికి సంవత్సరానికి రూ.3 లక్షల ఆరోగ్య బీమా ‘మా’ చెల్లిస్తుంది. అది వచ్చే జనవరి నుంచి అన్ని విధాలుగా అమలయ్యేలా చేస్తాం.
3. ఎఫ్ఎన్సీసీలో ‘మా’ సభ్యులకి అసోసియేట్ మెంబర్షిప్ ఇవ్వడం.
4. వృద్థ కళాకారులకు ప్రస్తుతం రూ.6 వేలు ఇస్తున్న ఫించన్ నవంబర్ నుంచి రూ.10 వేలకు పెంచేలా చర్యలు తీసుకుంటాం.
5. గతంలో మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘ఆసరా’ని పునఃప్రారంభిస్తాం. ఈ కమిటీలో ఉండే 13 మంది పేర్లను త్వరలోనే ప్రకటిస్తాను.
6. ఎవరైనా ‘మా’ సభ్యుడు ఆకలి బాధ పడుతుంటే కాల్ చేసిన రెండు గంటల్లోనే అతడి ఇంటికి నెల రోజులకు సరిపడా వంట సామాగ్రి ఏర్పాటు చేస్తాం.