‘టక్ జగదీష్’ రాక అప్పుడేనా?
ABN , First Publish Date - 2021-07-10T00:14:35+05:30 IST
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టక్ జగదీష్’. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టక్ జగదీష్’. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయాలని ముందుగా నిర్మాతలు భావించినప్పటికీ కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు పరిస్థితులు కాస్త కుదుటపడటంతో నిర్మాతలు మళ్లీ సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ‘టక్ జగదీష్’ చిత్రాన్ని మేకర్స్ ఆగస్ట్ 13న విడుదల చేసే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రలో నటించారు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మాతలు.