Shiva Nirvana : మళ్ళీ ఆ హీరోతోనేనా?

ABN , First Publish Date - 2021-09-29T17:21:50+05:30 IST

‘నిన్నుకోరి, మజిలీ’ లాంటి లవ్ అండ్ ఎమోషనల్ స్టోరీస్ తో టాలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పించారు యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ. అయితే దీని తర్వాత నానీతో ‘టక్ జగదీశ్’ లాంటి ఫ్యామిలీ యాక్షన్ మూవీ తీసి ఆశ్చర్యపరిచారు శివ. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘టక్ జగదీశ్’ మూవీ మిశ్రఫలితాన్ని అందుకుంది.

Shiva Nirvana : మళ్ళీ ఆ హీరోతోనేనా?

‘నిన్నుకోరి, మజిలీ’ లాంటి లవ్ అండ్ ఎమోషనల్ స్టోరీస్ తో టాలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పించారు యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ. అయితే దీని తర్వాత నానీతో ‘టక్ జగదీశ్’ లాంటి ఫ్యామిలీ యాక్షన్ మూవీ తీసి ఆశ్చర్యపరిచారు శివ. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘టక్ జగదీశ్’ మూవీ మిశ్రఫలితాన్ని అందుకుంది. అందుకే నేమో శివ తదుపరి చిత్రంగా మళ్ళీ ప్రేమకథా చిత్రమే తీస్తానని ప్రకటించారు.  ఆ కథను వైజాగ్ బీచ్ లో  రాస్తున్నానని కూడా ఇటీవల తెలిపారు. అయితే ఈ సినిమా నాగ చైతన్య తోనే ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 


నిజానికి శివ నిర్వాణ తదుపరి చిత్రం విజయ్ దేవరకొండ తో చేయాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మూవీ వాయిదా పడింది.  ప్రస్తుతం శివ.. చై కోసం ఓ డిఫరెంట్ లవ్ స్టోరీని రాస్తున్నట్టు సమాచారం. ఇదివరకు శివ చైతూ తో తీసిన ‘మజిలీ’ ఏ రేంజ్ లో హిట్టయిందో తెలిసిందే. ఇప్పుడు చైతూ తో మరోసారి చేయబోయే సినిమాకి కూడా ఆ రేంజ్ లోనే ఎమోషనల్ టచ్ ఇస్తున్నారట శివ.  అతి త్వరలో ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. ఇటీవల శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ తో సాలిడ్ హిట్ కొట్టిన చైతూ.. తర్వాత విక్రమ్ కుమార్ ‘థాంక్యూ’లోనూ, తండ్రి నాగార్జున తో ‘బంగార్రాజు’ లోనూ నటిస్తున్నారు. 

Updated Date - 2021-09-29T17:21:50+05:30 IST