సినిమా రివ్యూ: మంచి రోజులు వచ్చాయి
ABN , First Publish Date - 2021-11-05T06:51:29+05:30 IST
చిన్న సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు దర్శకుడు మారుతి. ఆయన సినిమా అంటే వినోదానికి కొదవే ఉండదు. నవ్వులకు పక్కా గ్యారెంటీ. చిన్న హీరోలతో సినిమాలు చేసినా ఆయన స్టార్ హీరోలతోనూ సినిమాలు తీసి విజయం సాధించారు. తీరిక సమయంలో బడ్జెట్ చిత్రాలు, కొత్త హీరోలతోనూ సినిమా చేస్తుంటారు. ఒక పక్క గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తూనే కరోనాతో వచ్చిన విరామంలో సంతోష్ శోభన్ హీరోగా, మెహరీన్ హీరోయిన్‌గా ‘మంచి రోజులు వచ్చాయి’ అనే చిన్న సినిమా చేశారు.

సినిమా రివ్యూ: మంచి రోజులు వచ్చాయి
విడుదల తేది: 04–11–2021
నటీనటులు: సంతోష్ శోభన్, మెహరీన్, సప్తగిరి, వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు.
కెమెరా: సాయి శ్రీరామ్
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటింగ్: ఎస్‌బీ ఉద్థవ్
బ్యానర్: యు.వి. కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్
నిర్మాత: వి సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్
రచన, దర్శకత్వం: మారుతి.
చిన్న సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు దర్శకుడు మారుతి. ఆయన సినిమా అంటే వినోదానికి కొదవే ఉండదు. నవ్వులకు పక్కా గ్యారెంటీ. చిన్న హీరోలతో సినిమాలు చేసినా ఆయన స్టార్ హీరోలతోనూ సినిమాలు తీసి విజయం సాధించారు. తీరిక సమయంలో బడ్జెట్ చిత్రాలు, కొత్త హీరోలతోనూ సినిమా చేస్తుంటారు. ఒక పక్క గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తూనే కరోనాతో వచ్చిన విరామంలో సంతోష్ శోభన్ హీరోగా, మెహరీన్ హీరోయిన్‌గా ‘మంచి రోజులు వచ్చాయి’ అనే చిన్న సినిమా చేశారు. దీపావళి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ:
తిరుమలశెట్టి గోపాల్ అలియాస్ గుండు గోపాల్ (అజయ్ ఘోష్)కి తన కూతురు పద్దు (మెహరీన్) అంటే ప్రాణం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేేస పద్దు అంటే ఎంతో నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేసి కొలీగ్ సంతోష్(సంతోష్ శోభన్)తో ప్రేమలో పడుతుంది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉంటారు. ఎప్పుడూ భమం భయంగా ఆనందంతో కనిపించే గోపాల్‌ను చూసి పక్కింటి వ్యక్తులు వ్యక్తులు ఇద్దరు అసూయతో ఆయనలో మరింత భయాన్ని, అపోహల్ని కలిగిస్తారు. దాంతో గోపాల్ పద్దు విషయంలో ఆందోళన చెందడం ప్రారంభిస్తాడు. పైగా కరోనా భ మరోవైపు. ఇన్ని చిక్కుల మధ్య సంతోష్, పద్దుల లవ్‌జర్నీ ఎలా ముందుకు సాగింది హీరో తనకు కాబోయే మావగారి భయాల్ని ఎలా దూరం చేశాడు అన్నది మిగతా కథ.
విశ్లేషణ:
సినిమా, సినిమాకు కొత్త పాత్రను, కొత్త అంశాన్ని సృష్టించే మారుతి ఈ సినిమాలో భయం అనే కాన్సెప్ట్‌ను తీసుకున్నారు. కథగా చూేస్త కొత్తగా అనిపించకపోయినా రాసుకున్న సన్నివేశాలు, సందర్భాలు కీలకంగా మలుచుకుని తెరకెక్కించారు మారుతి. తన కూతురు ప్రేమలో పడిందనే విషయం తెలిసాక అజయ్ ఘోష్ మనసులో ఆందోళన మొదలవుతుంది. అక్కడి నుంచే కథ పట్టాలెక్కుతుంది. కరోనా సమయంలో రాసిన ఈ కథలో కరోనా అంశాలు కూడా ఉంటాయని ప్రచారం చేసినా ఆ అంశానికి పెద్దగా పాధాన్యం లేదు. ఎంతోమందిని పొట్టన పెట్టుకున్న, వేల కుటుంబాల్లో విషాదం నింపిన కరోనాను కామెడీ కోసం వాడుకోవడం ఫిట్‌గా అనిపించలేదు. సెకెండాఫ్‌లో కాస్త సాగదీతగా ఉంటుంది. అయితే లాజిక్కులు గురించి ఆలోచించకుండా చూస్తే మాత్రం వినోదాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఆ విషయంలో మారుతి విజయవంతమయ్యాడు. మరో విషయం ఏంటంటే మారుతి సినిమాలో కామెడీ ఎంత ముఖ్యంగా ఉంటుందో అడల్ట్ కంటెంట్ కూడా అంతే! కొన్ని సన్నివేశాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్‌లను డైరెక్ట్ ఎటాక్‌లా ఉపయోగించారు. అక్కడక్కడా ఎమోషన్స్ కూడా వర్కవుట్ అయ్యాయి. కొన్ని సన్నివేశాలు రిపీట్ అయినట్లు అనిపిస్తుంది. ఇక ఆర్టిస్ట్‌ల విషయానికి వస్తే... అజయ్ ఘోష్ పాత్ర సినిమాకి చాలా కీలకం. ఆయన చుట్టూనే ఎక్కువ శాతం నడుస్తుంది. తనదైన తనతో ఆకట్టుకున్నారు. సంతోష్, మెహరీన్ జోడీ బాగుంది. నటన, పాటలతో అలరించారు. పాలసీ మూర్తిగా శ్రీనివాస్, డాక్టర్‌గా వెన్నెల కిషోర్ ఫ్రరేస్టషన్, అంబులెన్స్‌తో సప్తగిరి చేేస హంగామా నవ్వించే ప్రయత్నం చేశారు. ఇతర పాత్రధారులు పాత్రలకు న్యాయం చేశారు. కెరీర్ బిగినింగ్‌లో మారుతి సినిమాలకు ‘కొత్త జంట’ తర్వాత మారుతికి చాలా తేడా ఉంది. ఓ ముద్ర పడిన మారుతి తన పంధాను మార్చుకుని ఫ్యామిలీ సినిమాలు చేశారు. అయితే ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు చూస్తే.. మళ్లీ మారుతి పాత రోజుల్లోకి వెళ్తున్నారేమో అనిపిస్తుంది. అనూప్ సంగీతం, సాయి శ్రీరామ్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
ట్యాగ్‌లైన్: లాజిక్కులు పట్టించుకోకుండా నవ్వుకోవచ్చు.