వాళ్లు లేకపోతే కొండపొలం లేదు
ABN , First Publish Date - 2021-10-04T07:34:46+05:30 IST
‘‘పవన్ కల్యాణ్‌గారు అంగీకరించడం వల్లే ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణకు విరామం వచ్చినప్పుడు ఈ సినిమా చేశా. దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి, సుకుమార్‌గారు నాకు ఈ నవలను పరిచయం చేయకపోయినా...

‘‘పవన్ కల్యాణ్‌గారు అంగీకరించడం వల్లే ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణకు విరామం వచ్చినప్పుడు ఈ సినిమా చేశా. దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి, సుకుమార్‌గారు నాకు ఈ నవలను పరిచయం చేయకపోయినా... సన్నపురెడ్డి వెంకటరెడ్డి ఈ నవలను రాయకపోయినా... ‘కొండపొలం’ వచ్చేది కాదు. వాళ్లు లేకపోతే ఈ సినిమా లేదు’’ అని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అన్నారు. వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొండపొలం’. ఈ నెల 8న థియేటర్లలో విడుదలవుతోంది. శనివారం రాత్రి కర్నూల్లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ ‘‘సినిమాలో రవీంద్ర అనే యువకుడిగా కనిపిస్తా. మనలో ఒకడు అనిపించేలా ఆ పాత్ర ఉంటుంది. ఇది మన అందరి కథ. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా తలెత్తుకొని తిరగాలని చెప్పే వక్తిత్వం ఉన్న పాత్ర. నవలను అద్భుతంగా తెరపైకి తెచ్చేందుకు క్రిష్ చాలా కష్టపడ్డారు’’ అని చెప్పారు. రకుల్ ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ ‘‘ఓబులమ్మ పాత్ర నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో క్రిష్ నన్ను కొత్త లుక్‌లో చూపించారు. ఇంతకంటే గొప్ప పాత్రను కోరుకోలేం’’ అని అన్నారు. సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ ‘‘ఆత్మన్యూనత భావం, అపనమ్మకం ఉన్నప్పుడు పాడుకునే మంత్రాన్ని ఈ సినిమాలో కంపోజ్ చేశాను. ఇక్కడకు వస్తూనే ఓ పాటను విడుదల చేశాం’’ అని చెప్పారు. చిత్ర నిర్మాత రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘నిర్మాతలకు కొంతమంది హీరోలతో పనిచేయాలని ఉంటుంది. నాకు కీరవాణిగారితో పనిచేయాలనేది కోరిక. ఈ చిత్రంతో మరోసారి తీరింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సాయిచంద్ పాల్గొన్నారు.