రష్మిక మందన్నకి అంత టెన్షన్ ఎందుకు..?
ABN , First Publish Date - 2021-04-01T16:38:46+05:30 IST
హీరోయిన్‌గా లక్ చెక్ చేసుకునేందుకు చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీకి వస్తుంటారు. వాళ్ళలో అతి కొద్ది మందికి మాత్రమే స్టార్ స్టేటస్ దక్కుతుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ.. ఇలా అన్నీ భాషల్లో హీరోయిన్స్‌కి ప్రతి సినిమా ఒక కొత్త అనుభవమే. ఒక సినిమా ఒప్పుకొని ఆ సినిమా నటించడంలో ఎంత ఎంజాయ్ చేస్తారో.

హీరోయిన్‌గా లక్ చెక్ చేసుకునేందుకు చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీకి వస్తుంటారు. వాళ్ళలో అతి కొద్ది మందికి మాత్రమే స్టార్ స్టేటస్ దక్కుతుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ.. ఇలా అన్నీ భాషల్లో హీరోయిన్స్‌కి ప్రతి సినిమా ఒక కొత్త అనుభవమే. ఒక సినిమా ఒప్పుకొని ఆ సినిమా నటించడంలో ఎంత ఎంజాయ్ చేస్తారో..అదే సినిమా రిలీజ్ అయ్యే సమయంలో కాస్త టెన్షన్ పడుతుండటం సహజం. ఎందుకంటే ఆ సినిమా రిజల్ట్ మీదే కెరీర్ ముందుకు సాగుతుంటుంది కాబట్టి. ఒక భాషలో క్రేజ్ వచ్చేసరికి మరో భాషలో స్టార్ హీరోలతో నటించే అవకాశాలు విరివిగా వస్తుంటాయి. అంతేకాదు భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేస్తుంటారు దర్శక, నిర్మాతలు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఇదే మంచి అవకాశం అనుకున్న హీరోయిన్స్.. వచ్చిన అవకాశాన్ని వద్దనకుండా భాష.. రాకపోయినా..తెలీకపోయినా ఒప్పేసుకుంటారు.
అయితే ఏ భాషలో ఎంట్రీ ఇచ్చిన డెబ్యూ సినిమా రిలీజ్‌కి ముందు ఉండే టెన్షన్ అంతా ఇంతా కాదు. సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. ఈ సెంటిమెంట్ వల్లే హీరోయిన్ నటించిన డెబ్యూ సినిమా సూపర్ హిట్ అయితే లక్కీ హీరోయిన్ అంటారు. లేదంటే ఐరెన్ లెగ్ ముద్ర వేస్తారు. ప్రేక్షకుల్లో ఉండే అనచానాలు వేరే లెవల్. ఇప్పుడు ఇలాంటి టెన్షన్‌లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న ఉందట. ఛలో సినిమాతో తెలుగు తెరకి పరిచయమయి క్రేజ్ సంపాదించుకొని ప్రస్తుతం టాలీవుడ్‌లో పుష్ప వంటి పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న రష్మిక.. బాలీవుడ్‌లో కూడా రెండు క్రేజీ మూవీస్ చేస్తోంది. ఇదే క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తి సరసన సుల్తాన్ సినిమాలో అవకాశం అందుకుంది. రష్మికకి ఈ సినిమా కోలీవుడ్‌లో డెబ్యూ సినిమా. మరికొన్ని గంటల్లో సుల్తాన్ సినిమా రిలీజ్ కాబోతోంది. దాంతో రష్మికలో టెన్షన్ మొదలైందట. ఇక ఈ సినిమా హిట్ అయితే కోలీవుడ్‌లో వరసగా అవకాశాలు వస్తాయని చెప్పుకుంటున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
