రిలీజ్‌కు ముందే రికార్డ్ కొట్టిన ‘వైట్ పేపర్’.. టైటిల్ లుక్ విడుదల

ABN , First Publish Date - 2021-09-25T02:42:53+05:30 IST

జి.ఎస్.కె ప్రొడక్షన్స్ పతాకంపై శివ దర్శకత్వంలో గ్రందే శివ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘వైట్ పేపర్’. ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘ఈశ్వర్’ చిత్రంలో ప్రభాస్ ఫ్రెండ్‌గా తన నట జీవితాన్ని ప్రారంభించిన అభినయ కృష్ణ(అదిరే అభి) ఈ చిత్రంతో..

రిలీజ్‌కు ముందే రికార్డ్ కొట్టిన ‘వైట్ పేపర్’.. టైటిల్ లుక్ విడుదల

జి.ఎస్.కె ప్రొడక్షన్స్ పతాకంపై శివ దర్శకత్వంలో గ్రందే శివ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘వైట్ పేపర్’. ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘ఈశ్వర్’ చిత్రంలో ప్రభాస్ ఫ్రెండ్‌గా తన నట జీవితాన్ని ప్రారంభించిన అభినయ కృష్ణ(అదిరే అభి) ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. సెప్టెంబర్ 24న అదిరే అభి పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ‘వైట్ పేపర్’ సినిమా టైటిల్ లుక్‌ను విడుదల చేశారు. టైటిల్ పోస్టర్‌ను మనో, ఇంద్రజ, అనసూయ విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్ర విషయానికి వస్తే.. కేవలం 9 గంటల 51 నిమిషాల వ్యవధిలో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయడం విశేషం. ఈ ఘనతతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి నుండి అరుదైన చిత్రంగా సత్కారం అందుకుందీ చిత్రం.


టైటిల్ పోస్టర్ విడుదల అనంతరం సింగర్ మనో మాట్లాడుతూ.. ‘‘వైవిధ్య కథనాలు ఎంచుకోవడంలో అభి ముందుంటాడు. అలానే ఇప్పుడు ఈ వైట్ పేపర్ సినిమాని కూడా డిఫరెంట్‌గా చేశాడు, ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అని అనగా.. ఇంద్రజ మాట్లాడుతూ.. సామాన్యంగా నటీనటులు తమ పాత్రలు చేస్తున్నప్పుడు ఎంతో హోమ్ వర్క్ చేస్తారు. అలాంటిది ఒక్క రోజులో అదీ కూడా 9 గంటల 51 నిమిషాల టైమ్ టార్గెట్ పెట్టుకొని సినిమా తియ్యడం అంటే అభి అండ్ టీమ్ ఎంత వర్క్ చేసి ఉంటారో అర్థమవుతుంది. చిత్రయూనిట్‌కు నా అభినందనలు.. అన్నారు. అనసూయ మాట్లాడుతూ.. అభిని ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఏదైనా చేయాలి అనుకుంటే చాలా కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు. వైట్ పేపర్ సినిమాలో హీరోగా చేయడమే కాకుండా, ఆ సినిమాని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నిలిచేలా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. టీం అందరికి శుభాకాంక్షలు..’’ అన్నారు.


హీరో అభి మాట్లాడుతూ.. ‘‘కథ చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. కేవలం 9 గంటల 51 నిమిషాల సమయంలోనే సినిమా షూటింగ్ అంత పూర్తి చేయాలి అన్నప్పుడు దర్శకుడి డెడికేషన్ నచ్చింది. ఈ చిత్రానికి విడుదల ముందే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు రావటం.. మనో గారు, ఇంద్రజగారు, అనసూయగారు మా చిత్రం టైటిల్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది..’’ అని తెలుపగా.. డైరెక్టర్ శివ మాట్లాడుతూ.. ‘‘సస్పెన్స్ కథనంతో తెరకెక్కిన ఈ సినిమాలో అభి హీరోగా నటించారు. తను లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు, మాకు అవార్డు కూడా వచ్చేది కాదేమో, మాకు అభి ఇచ్చిన సపోర్ట్‌తోనే ఈ ఘనత సాధించాము. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ లుక్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది..’’ అని అన్నారు.

Updated Date - 2021-09-25T02:42:53+05:30 IST